ఈవీవీ తీయలేకపోయిన ‘కొంపకొల్లేరు’

ఈవీవీ తీయలేకపోయిన ‘కొంపకొల్లేరు’

తెలుగు సినిమా చరిత్రలో ఈవీవీ సత్యానారాయణది ప్రత్యేక అధ్యాయం. ఏకంగా యాభైకి పైగా సినిమాలు చేశారాయన. ఎక్కువగా కామెడీ ఎంటర్టైనర్లే చేసిన ఆయన సెంటిమెంట్.. యాక్షన్ సినిమాలు కూడా ట్రై చేశాడు. టాలీవుడ్లో చాలామంది స్టార్లతో పని చేశాడు. చివరి దశలో ఎక్కువగా చిన్న స్థాయి కామెడీ ఎంటర్టైనర్లే ట్రై చేశాడు. ఇంకా సినిమాలు చేస్తుండగానే 54 ఏళ్ల వయసులోనే ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆ విషాదం చోటు చేసుకోకపోయి ఉంటే ఈవీవీ ఇంకా సినిమాలు చేస్తూనే ఉండేవారేమో. చనిపోవడానికి ముందు కూడా ఆయన కథల తయారీ పనిలోనే ఉండేవారట. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నపుడు కూడా తాను చేయాలనుకున్న ఓ సినిమా గురించి చిన్న కొడుకు అల్లరి నరేష్‌తో చర్చించారట.

ఆ సినిమా పేరు.. ‘కొంప కొల్లేరు’ అని వెల్లడించాడు నరేష్.  2012లో యుగాంతం వస్తుందని.. ప్రపంచం నామరూపాల్లేకుండా పోతుందని ఒక ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. దాని నేపథ్యంలోనే ‘కొంపకొల్లేరు’ అనే కథ తయారు చేశారట ఈవీవీ. యుగాంతం నేపథ్యంలో సెటైరిగ్గా కథ  నడుస్తుందట. 2012 డిసెంబరులో యుగాంతం జరుగుతుందనుకుంటే.. ముందు నెలలో సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని ఈవీవీ భావించారని.. ఆసుపత్రిలో ఉన్నపుడు ఆ విషయాన్నే తన దగ్గర ప్రస్తావించారని నరేష్ తెలిపాడు.

ఐతే ఈలోపే హఠాత్తుగా తన తండ్రి మరణించాడని.. దీంతో ఆయన అనుకున్న కథలన్నీ పక్కకు వెళ్లిపోయాయని నరేష్ చెప్పాడు. అప్పుడాయన రెడీ చేయించిన కథల్లో కొన్ని ఔట్ డేటెడ్ అయిపోయాయని.. ఇంకొన్నింటిని తెరకెక్కించే దర్శకులు లేరని చెప్పాడు నరేష్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English