‘ఛాలెంజ్’ డైలాగ్‌తో చిరును పడేశాడు

‘ఛాలెంజ్’ డైలాగ్‌తో చిరును పడేశాడు

దర్శకుడు హరీష్ శంకర్ మాటలతో మాయ చేసేస్తాడు. సినిమాలకు డైలాగులు రాయడంలోనే కాదు.. చక్కటి మాటలతో ప్రసంగాల్ని రక్తి కట్టించడంలోనూ అతను దిట్ట. మైకు అందుకున్నాడంటే రసవత్తరంగా సాగిపోతుంది అతడి మాటల ప్రవాహం. తాజాగా ‘తేజ్ ఐ లవ్యూ’ ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముందు అతను చేసిన ప్రసంగం భలేగా సాగింది. అభిమానుల్ని ఉర్రూతలూగించడంతో పాటు చిరును కూడా ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేశాయి అతడి మాటలు.

మెగాస్టార్ చిరంజీవి తమ సినిమాల వేడుకలకు రావాలని చాలామంది ఆశిస్తారని.. ఆయన్ని అడుగుతుంటారని.. చిరు కూడా చాలామంది మాటల్ని మన్నించి వేడుకలకు వస్తుంటారని.. అది చూసి ఆయన అలసిపోరా అన్న సందేహం తనకు కలుగుతూ ఉంటుందని హరీష్ చెప్పాడు. ఐతే ఇదంతా చూసినపుడల్లా తనకు ‘ఛాలెంజ్’ సినిమాలో ఒక సీన్.. అందులో చిరు చెప్పిన ఒక డైలాగ్ గుర్తుకొస్తుందని హరీష్ దాని గురించి వివరించాడు.

50 లక్షలు సంపాదిస్తానంటూ రావుగోపాల్రావు దగ్గర సవాలు చేసి వచ్చాక గుడి దగ్గర కూర్చుని ఉంటే.. పెద్దావిడ ధర్మం చేయమని అడుగుతుందని.. దానికి చిరు విసుక్కుంటాడని.. తర్వాత ఆ పెద్దావిడే చిరుకు పది పైసలిచ్చి నీరసంగా ఉన్నావు ఏమైనా తినమని అంటుందని.. అప్పుడు చిరు ‘‘నువ్విచ్చింది పది పైసలు కాదు.. పది కోట్లు సంపాదించే ఆత్మవిశ్వాసం’’ అని డైలాగ్ చెబుతాడని.. చిరంజీవి ఏదైనా సినిమా వేడుకకు వస్తే వచ్చే ఆత్మవిశ్వాసం, ఉత్తేజం కూడా అలాంటివే అని.. పది కోట్లు కాదు.. వంద కోట్ల విలువైన ఆత్మవిశ్వాసాన్ని ఆయన అందిస్తారని హరీష్ అనడంతో ఆడిటోరియం హోరెత్తిపోయింది. ఈ మాటలు చెబుతుంటే చిరంజీవి కూడా అమితానందానికి గురయ్యాడు ఈ మాటలంటుంటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు