‘బిగ్ బాస్’పై శ్రీరెడ్డి స్పందించింది

‘బిగ్ బాస్’పై శ్రీరెడ్డి స్పందించింది

పవన్ కళ్యాణ్‌ను బూతు తిట్టిన అనంతరం శ్రీరెడ్డి మాటలకు విలువ పడిపోయింది. ఆమె చేస్తున్న పోరాటానికి బ్రేక్ పడిపోయింది. పరిస్థితి అర్థం చేసుకుని ఆమె కొన్నాళ్ల పాటు సైలెంటుగా ఉంది. కానీ ఈ మధ్య మళ్లీ శ్రీరెడ్డి వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ఆమె టార్గెట్ మారిపోయిన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నానిని ఆమె లక్ష్యంగా చేసుకుంది. నానీ బాగోతం బయటపెడతానంటూ ఒకటికి రెండుసార్లు హెచ్చరించింది.

తాజాగా ఆమె నాని హోస్ట్‌గా మొదలు కాబోతున్న ‘బిగ్ బాస్’ షో గురించి మాట్లాడటం విశేషం. చాలామంది అనుకుంటున్నట్లుగా తాను ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనడం లేదని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. ‘‘నా స్నేహితులకు చేదు వార్త. ఇది నా దురదృష్టం. ‘బిగ్ బాస్’లో నేను పాల్గొనడం లేదు. నేను హౌస్‌లో ఉంటానని ఊహించకండి. ఈ వార్త కొందరికి సంతోషంగా ఉంటుందని తెలుసు. కొందరు బాధపడొచ్చు. పోటీదారులు అదృష్టవంతులు. ‘బిగ్ బాస్’ బృందానికి ఆల్ ద బెస్ట్’’ అని శ్రీరెడ్డి పేర్కొంది.

కొన్ని రోజుల కిందట శ్రీరెడ్డి ‘బిగ్ బాస్’ షోలో పాల్గొంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే శ్రీరెడ్డి షోలోకి వస్తే గొడవలు జరిగిపోతాయని.. అలాగే నానీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని భావించి ఆమెను జాబితా నుంచి తొలగించినట్లు గుసగుసలు వినిపించాయి. దీని వెనుక నాని ఉన్నట్లు కూడా చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యఖ్యాలు ఆసక్తి రేకెత్తించేవే. తన అవకాశాల్ని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోనని.. నాని గుట్టంతా బయటపెడతానని ఆమె అన్న నేపథ్యంలో శ్రీరెడ్డి ‘బిగ్ బాస్’లో పాల్గొనకుండా నానీనే అడ్డుకున్నాడేమో అన్న ఊహాగానాలు నడుస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు