మార్కెట్‌ పోతుందని దేవరకొండ బెంగ

మార్కెట్‌ పోతుందని దేవరకొండ బెంగ

అర్జున్‌ రెడ్డితో యువతరానికి హాట్‌ ఫేవరెట్‌గా మారిన విజయ్‌ దేవరకొండ దానిని ఎలాగైనా కౌంట్‌ చేయాలని చూస్తున్నాడు. ఎప్పుడో ఆగిపోయిన ఏ మంత్రం వేసావె చిత్రం విడుదల కావడంతో అతను అడ్డుకోలేకపోయాడు. తర్వాత మహానటిలో చిన్న క్యారెక్టర్‌లో మాత్రమే కనిపించాడు. ఈ టైమ్‌లో అతను హీరోగా చేసిన చిత్రం కనుక మిస్‌ఫైర్‌ అయితే మార్కెట్‌కి దెబ్బ పడుతుంది.

ఇది రియలైజ్‌ అయిన విజయ్‌ దేవరకొండ 'టాక్సీవాలా' చిత్రం విషయంలో చాలా భయపడుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి పలు రిపేర్లు చేసారు. అయినప్పటికీ విడుదల తేదీ మళ్లీ మళ్లీ వాయిదా వేస్తూనే వున్నారు. పెళ్లిచూపులు తర్వాత మొదలైన చిత్రం కావడంతో తక్కువ బడ్జెట్‌లో తీసేసిన ఈ చిత్రానికి అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ తర్వాత పెట్టుబడి పెంచారు. అయినా కానీ ఫైనల్‌ ప్రోడక్ట్‌ విషయంలో కాన్ఫిడెంట్‌గా వున్నట్టు లేరు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేసినా కానీ ఇంకా విడుదల తేదీ పరంగా క్లారిటీ రాలేదు. ఈ చిత్రం తేడా అయితే తదుపరి చిత్రాలు ఎఫెక్ట్‌ అవుతాయని, అర్జున్‌ రెడ్డితో వచ్చిన క్రేజ్‌ తగ్గిపోతుందని అతను బెంగ పడుతున్నాడట.

దీనికంటే ముందుగా వేరే చిత్రాన్ని విడుదల చేయించాలనే ఆలోచన కూడా వుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్నిసార్లు వాయిదా వేస్తూ పోవడంతో సినిమాపై రాంగ్‌ సిగ్నల్స్‌ వెళుతున్నాయి. మరింత జాప్యం జరగకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు