మళ్లీ తెలంగాణలో సాయి పల్లవి రచ్చ

మళ్లీ తెలంగాణలో సాయి పల్లవి రచ్చ

తెలుగు రాకపోయినా తెలంగాణ మాండలికంలో డైలాగులు అదరగొట్టి ప్రేక్షకులని ఫిదా చేసేసిన సాయి పల్లవి మరోసారి తెలంగాణ పడతిగా కనిపించబోతోంది. స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా, తన పాత్రకి ప్రాధాన్యం లేదని తోసిపుచ్చిన సాయి పల్లవి తనకి నచ్చిన సినిమాలు మాత్రమే ఎంచుకుని చేస్తోంది. హీరో ఎవరు, బ్యానర్‌ ఏది అనే లెక్కలు వేసుకోకుండా పేరు తెచ్చే చిత్రాలు మాత్రం సెలక్ట్‌ చేసుకుంటోంది.

'నీదీ నాదీ ఒకే కథ' చిత్రంతో మెప్పించిన దర్శకుడు వేణు ఉడుగుల మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. ఇందులో కథానాయికగా నటించేందుకు సాయి పల్లవి అంగీకరించింది. ఈ చిత్రంలో ఆమె తెలంగాణ యువతిగా కనిపించబోతోంది. ఇంకా హీరో ఎవరనేది డిసైడ్‌ అవలేదు. సాయి పల్లవి హీరోయిన్‌ అంటే ఏ యువ హీరో అయినా డేట్స్‌ ఇచ్చేస్తాడు కనుక ఈ చిత్రానికి హీరోని తెచ్చుకోవడం అంత కష్టమేమీ అవదు. సాయి పల్లవి గత చిత్రం కణం విజయం సాధించకపోయినా కానీ ఆ చిత్రం జానర్‌ వేరు కనుక దానిని ట్రేడ్‌ లెక్క చేయడం లేదు.

ఆమె నటిస్తోన్న కమర్షియల్‌ సినిమాలకి మాత్రం ఎప్పటిలానే మంచి డిమాండ్‌ వుంది. శర్వానంద్‌తో చేస్తోన్న పడి పడి లేచె మనసు చిత్రానికి ప్రస్తుతం ట్రేడ్‌లో చాలా క్రేజ్‌ నెలకొని వుందంటే దానికి సాయి పల్లవి ఫ్యాక్టర్‌ చాలా వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు