పెదనాన్న చలవతో రామ్‌ సేఫ్‌

పెదనాన్న చలవతో రామ్‌ సేఫ్‌

ప్రవీణ్‌ సత్తారుతో హిమాలయాల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ సినిమా చేద్దామని రామ్‌ సిద్ధపడ్డాడు. బడ్జెట్‌ ఎక్కువైనా కానీ రవికిషోర్‌ కూడా ఈచిత్రం పట్ల నమ్మకంతో రంగంలోకి దిగారు. నలభై కోట్ల వ్యయంతో తీస్తే డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌తో పాటు సేఫ్‌ జోన్‌లోకి వెళ్లే అవకాశముంటుందని భావించారు. కానీ అంచనాల్లోనే యాభై కోట్ల పైచిలుకు బడ్జెట్‌ అవుతుండే సరికి చూస్తూ, చూస్తూ నష్టపోయే సినిమా ఎందుకని రవికిషోర్‌ అభ్యంతరం చెప్పారు.

రామ్‌ కూడా పెదనాన్న క్యాలిక్యులేషన్‌ కరెక్టేనని భావించి ప్రవీణ్‌ సత్తారుకి సారీ చెప్పేసాడు. అయితే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులకే రెండు కోట్ల వ్యయం అయిందట. మొత్తంగా నష్టపోవడం కంటే ఈ రెండు పోగొట్టుకోవడం మేలు అని రవికిషోర్‌ భావించి ఈ చిత్రాన్ని ఆపేసారని ప్రచారం జరిగింది. అయితే నిజానికి రవికిషోర్‌కి పెద్దగా నష్టం జరగలేదట. షూటింగ్‌ ఛాలెంజింగ్‌ లొకేషన్లలో ప్లాన్‌ చేయడంతో ఎటుపోయి ఎటు వస్తుందోనని ముందుగానే ఇన్సూర్‌ చేసారట. ఏ కారణం చేత అయినా సినిమా ఆగిపోయినా, షూటింగ్‌ చేసిన మెటీరియల్‌ కోల్పోయినా ఇన్సూరెన్స్‌లో కవర్‌ అవుతాయి.

ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లకముందే ఆగిపోవడంతో ఇన్సూరెన్స్‌ ద్వారా రవికిషోర్‌ పెట్టిన పెట్టుబడిలో అరవై శాతం తిరిగి వచ్చేసిందట. మిగతా నష్టం కోటి కంటే తక్కువే కావడం వల్ల దానిని వాళ్లు లెక్క చేయలేదు. కాకపోతే ఈ చిత్రం మొదలైపోతుందని మిగతా సినిమాలు వదిలేసుకున్న టెక్నీషియన్లు మాత్రం అవకాశాలు కోల్పోయి నష్టపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English