ఇదంతా రాజమౌళి మాస్టర్‌ ప్లాన్‌!

ఇదంతా రాజమౌళి మాస్టర్‌ ప్లాన్‌!

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ బయట ఎంత మంచి ఫ్రెండ్స్‌ అని తెలిసినా, వారిద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేస్తున్నా కానీ ఏళ్ల తరబడి వైరి హీరోల్లానే చూసిన అభిమానులు ఒకేసారి ఏకమైపోయి ఇద్దరికీ కలిపి జై కొట్టలేరు. ముప్పయ్యేళ్ల సంది విడిపోయిన నందమూరి, మెగా అభిమానులని ఒక్కసారిగా ఒకే తాటిపైకి తేవడం అంత ఈజీ కాదు. అందుకే ఈ చిత్రం రిలీజ్‌ అయ్యేలోగా ఇరువురి అభిమానులు ఒక్కటైపోవాలని, కనీసం డెబ్బయ్‌ శాతం మంది అయినా ఈ సినిమా విషయంలో కలిసికట్టుగా సపోర్ట్‌ ఇవ్వాలని రాజమౌళి చూస్తున్నాడు.

అందుకే చరణ్‌, ఎన్టీఆర్‌ల స్నేహం గురించి పబ్లిక్‌కి తెలిసేలా పలుమార్లు కలిసి కనిపించమని వారికి ఆదేశాలు ఇచ్చాడు. హీరోలిద్దరూ కూడా దీనిని తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. తరచుగా కలిసి ఫోటోలు దిగడమే కాకుండా, అభిమానులని ఆకర్షించే విధంగా మళ్లీ మళ్లీ ఫోజులిస్తున్నారు. నిజానికి తారక్‌, చరణ్‌ మధ్య స్నేహం ఎప్పట్నుంచో వుంది. అయితే దానిని పబ్లిగ్గా చూపించుకునేందుకు వారు ప్రాధాన్యత ఇవ్వలేదు. సినిమా విషయానికి వచ్చేసరికి అది అందరికీ తెలిసేలా వుండాలనేది రాజమౌళి ప్లాను. దీంతో వీళ్లు ఎన్నడూ లేనిది ఇప్పుడే పోస్టులు పెడుతూ వుండడంతో దీనిని పబ్లిసిటీలానే చూస్తున్నారు కొందరు.

సినిమాలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే ఫీలింగ్స్‌ రాకుండా, అభిమానులు థియేటర్లలో కొట్లాటలకి దిగకుండా వీలయినంత సఖ్యత తీసుకువచ్చేందుకు రాజమౌళి తీసుకునే జాగ్రత్తలలో భాగమే తమ కెమిస్ట్రీని పబ్లిక్‌కి చూపించడానికి కారణమని చెబుతున్నాయి సినీ వర్గాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు