ఆ సిరీస్‌లో నాలుగో సినిమా.. ఆమే హీరోయిన్

ఆ సిరీస్‌లో నాలుగో సినిమా.. ఆమే హీరోయిన్

హాలీవుడ్లో ఒక సినిమా పెద్ద హిట్టయితే ఆ వరుసలో సినిమాలు తీస్తూనే పోతారు. కొన్ని సినిమాలకు అరడజను సీక్వెల్స్ దాకా కూడా వచ్చాయి. ఈ ఒరవడిని బాలీవుడ్ వాళ్లు కూడా అందిపుచ్చుకుంటున్నారు. విజయవంతమైన సినిమాలకు సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీసేస్తున్నారు. ‘క్రిష్’ సిరీస్ అలాంటిదే.

దశాబ్దంన్నర కిందట వచ్చిన ‘కోయీ మిల్‌ గయా’కు కొనసాగింపుగా ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. ఆ సమయాలకు హృతిక్ రోషన్ కెరీర్లో అతి పెద్ద హిట్లుగా నిలిచాయి. ఐతే మూడో ‘క్రిష్’ చూశాక జనాలకు మొహం మొత్తేసిన ఫీలింగ్ కలిగింది. ఇక ఈ సిరీస్ ఆపేస్తే బెటరన్న అభిప్రాయాలు మెజారిటీ ప్రేక్షకులు వ్యక్తం చేశారు. కానీ హృతిక్ తండ్రి.. ఈ చిత్రాల దర్శకుడు రాకేశ్ రోషన్ మాత్రం అలా ఆలోచించట్లేదు.

కొన్నేళ్లుగా కేవలం ‘క్రిష్’ సిరీస్ సినిమాలకే పరిమితం అయిన రాకేశ్.. తన తర్వాతి ప్రాజెక్టుగా కూడా ఈ సీక్వెలే చేయాలని ఫిక్సయ్యాడు. క్రిష్-4 సినిమాను అనౌన్స్ చేసేశాడు. అంతే కాదు.. ఈ చిత్రంలో కథానాయిక ఎవరో కూడా తేల్చేశాడు. క్రిష్ సిరీస్‌లో గత రెండు సినిమాల్లోనూ కథానాయికగా నటించిన ప్రియాంక చోప్రా తర్వాతి భాగంలోనూ తప్పక ఉంటుందని ఆయన చెప్పాడు.

ప్రియాంక లేకుండా ఈ సినిమాను తాను ఊహించుకోలేనని కూడా అన్నాడు. ఐతే క్రిష్-3 చేసే సమయానికి.. ఇప్పటికి ప్రియాంక కెరీర్ మారిపోయింది. ఆమె హాలీవుడ్ టీవీ సిరీస్, సినిమాల్లో బిజీ అయిపోయింది. ఇండియన్ ఫిలిం మేకర్స్‌కు దొరకడం కష్టమైపోతోంది. అయినప్పటికీ ప్రియాంకనే తన హీరోయిన్ అంటున్నాడు రాకేశ్. ప్రస్తుతం హృతిక్ సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ బయోపిక్‌లో నటిస్తున్నాడు. అదయ్యాక హృతిక్ చేసే సినిమా క్రిష్-4నే అని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు