ఇంత కాలానికి హిట్టు కొట్టాడు

ఇంత కాలానికి  హిట్టు కొట్టాడు

మనకు అంతగా పరిచయం లేని తమిళ కథానాయకుడు ఏదైనా డబ్బింగ్ సినిమా ద్వారా హిట్ కొట్టి పేరు తెచ్చుకుంటే.. ఆ తర్వాత ఆ హీరో పేరు ముందు ఆ సినిమా పేరును చేర్చేయడం ఆనవాయితీ. ‘గజిని’ తర్వాత సూర్యకు.. ‘ఆవారా’ తర్వాత కార్తికి.. ‘రంగం’ తర్వాత జీవాకు అవే ఇంటి పేర్లుగా మారాయి. తెలుగువాడైన విశాల్‌కు ఆ రకంగా ఇంటిపేరుగా మారిన సినిమా ‘పందెంకోడి’. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్టే అయింది. విశాల్‌కు ఇంటి పేరుగా మారిపోయింది. ఆ తర్వాత విశాల్ ఆ స్థాయి హిట్టు ఒక్కటీ కొట్టలేదు తెలుగులో. తమిళంలో వరుస విజయాలతో పెద్ద రేంజికి చేరుకున్నప్పటికీ.. సరైన ప్లానింగ్, ప్రమోషన్ లేకపోవడం వల్ల అతడి సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు.

ఐతే చాలా ఏళ్ల తర్వాత ఇంత కాలానికి తెలుగులో అతడికి మళ్లీ కాలం కలిసొచ్చింది. గత వారం విడుదలైన అతడి కొత్త సినిమా ‘అభిమన్యుడు’ ఊహించని విజయం సాధించింది. దీనికి పోటీగా వచ్చిన తెలుగు సినిమాలు తేలిపోవడం, దీనికి మంచి టాక్ రావడం, ప్రమోషన్లు కూడా బాగా చేయడంతో మంచి వసూళ్లు సాధించింది. తెలుగులో అతడికి అది పెద్ద హిట్టుగా నిలిచింది.
ఈ చిత్రం రూ.6 కోట్ల దాకా షేర్.. రూ.10 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం విశేషం. విశాల్ రేంజికి ఇది చాలా పెద్ద మొత్తమే. కాబట్టి ఇక విశాల్ పేరు ముందు ‘పందెంకోడి’ అనే పదాన్ని తీసేసి ఇకపై అతడిని ‘అభిమన్యుడు’ విశాల్ అని పిలవొచ్చు. దీని ఒరిజినల్ ‘ఇరుంబుతిరై’ తమిళంలో కూడా విశాల్‌కు అతి పెద్ద హిట్టుగా నిలిచింది. అర్జున్, సమంత కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఎస్.మిత్రన్ దర్శకుడు. విశాలే ఈ చిత్రాన్ని నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు