కాలాను బతికించింది అతనే..

కాలాను బతికించింది అతనే..

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజవుతుంటే మామూలుగా కనిపించే హంగామా ‘కాలా’ విషయంలో కనిపించలేదు. దీనికి ప్రి రిలీజ్ బజ్ అంతంతమాత్రమే. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్లుగా సాగాయి. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. టాక్ కూడా అందుకు తగ్గట్లే ఉంది. ‘కబాలి’తో పోలిస్తే బెటర్ అంటున్నారే తప్ప.. ఇది నిఖార్సయిన హిట్ అనేవాళ్లు లేరు.

ఐతే ‘కబాలి’తో పోలిస్తే ఇందులో రజనీ హీరోయిక్ మూమెంట్స్ కొంతమేర కనిపించాయి. కొన్ని ఎలివేషన్లు సీన్లు భలే పండాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు.. అంతకుముందు వచ్చే ఫ్లైఓవర్ ఫైట్ కావచ్చు.. వీటిలో హీరోయిజం ఎలివేషన్ మామూలుగా లేదు. నిజానికి ఇంటర్వెల్ బ్యాంగ్‌లో రజనీ ఫైట్ ఏమీ చేయడు. పెద్దగా డైలాగులు కూడా కొట్టడు. అయినప్పటికీ ఆ సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఫ్లైవోవర్ ఫైట్ కూడా అంతే. దాని కంటే ముందు రియల్ ఎస్టేట్ సంస్థ ప్రపోజల్‌కు బ్రేక్ వేసి రజనీ నిష్క్రమించే సీన్ కూడా బాగానే పండింది. ఈ సన్నివేశాలు బాగా క్లిక్ అవ్వడానికి రజనీ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక కారణమైతే.. మరో కారణం సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్. కేవలం నేపథ్య సంగీతంతో ఒక సన్నివేశానికి ఎలా ప్రాణం పోయొచ్చో.. ఎలా ఎలివేట్ చేయొచ్చో చెప్పడానికి వీటిని ఉదాహరణగా చెప్పొచ్చు. తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న రజనీకి సరైన సీన్లు పడటం ఒకెత్తయితే.. వాటిని నేపథ్య సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లడం ఇంకో ఎత్తు. ఈ విషయంలో సంతోష్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మామూలుగా క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ అని పేరున్న సంతోష్.. ఈ చిత్రంలో తన మాస్ పవర్ చూపించాడు. ‘కబాలి’లో కూడా తన ప్రయత్నం తాను చేశాడు కానీ.. సినిమాలో ఎక్కడా బలమైన ఎలివేషన్ సీన్లు పడలేదు. కానీ ‘కాలా’లో అందుకు అవకాశం దక్కడంతో అతను చెలరేగిపోయాడు. పాటల విషయంలో నిరాశ పరిచినప్పటికీ నేపథ్య సంగీతం విషయంలో మాత్రం అతను అదరగొట్టాడు. ‘కాలా’ కొంచెమైనా బతికింది అంటే అందుకు రజనీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు