‘క్వీన్’ను అరవమయం చేసేశారట

‘క్వీన్’ను అరవమయం చేసేశారట

ఆ మధ్య శ్రుతి హాసన్ బాయ్ ఫ్రెండ్‌గా భావిస్తున్న ఒక విదేశీయుడు చెన్నైకి వెళ్లాడు. అతను శ్రుతి, కమల్‌లతో కలిసి ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. అతడికి చక్కగా పంచె కట్టించి, బొట్టు పెట్టించి ఆ కార్యక్రమానికి తీసుకెళ్లింది శ్రుతి. అది చూసి.. ఈ అరవోళ్లు ఎవరికైనా తమిళ టచ్ ఇచ్చేయగలరు అంటూ కామెంట్లు పడ్డాయి. నేటివిటీ అంటే ప్రాణం పెట్టే తమిళులు.. దేనికైనా తమదైన టచ్ ఇస్తారని ముందు నుంచి పేరుంది. ఏదైనా సినిమాల్ని తమిళంలో రీమేక్ చేసినా సరే.. నేటివిటీని జొప్పించే ప్రయత్నం చేస్తారు. ఆ భాషలో సినిమా కొత్తగా తయారవుతుంది. బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘క్వీన్’ సినిమాను తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమిళ టచ్ బాగానే ఇస్తున్నట్లు చెబుతోంది కథానాయిక కాజల్.


‘క్వీన్’ సినిమా మామూలుగా చూస్తే అర్బన్ బేస్డ్‌గా నడుస్తుంది. అక్కడి ప్రేక్షకులకే కనెక్టయ్యేలా ఉంటుంది. ఇలాంటి సినిమా తమిళ జనాలకు ఏం ఎక్కుతుందా అన్న సందేహాలున్నాయి. కానీ అలాంటి డౌట్లేమీ పెట్టుకోవద్దని అంటోంది కాజల్. ‘క్వీన్’ రీమేక్‌ను మారుమూల తమిళ పల్లెటూళ్లకు కూడా కనెక్టయ్యేలా మార్చినట్లు తెలిపింది కాజల్. ఇందులో తాను తమిళ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్నానని.. అందుకు తగ్గట్లుగా కథను మార్చారని.. తమిళ నేటివిటీ అంతా సినిమాలోకి తెచ్చామని ఆమె చెప్పింది. కాజల్ మాటల్ని బట్టి చూస్తుంటే ‘క్వీన్’ ఒరిజినల్‌తో పోలిస్తే ఇది భిన్నంగా ఉండబోతోందని.. తమిళ పైత్యాన్ని బాగానే దట్టించారని అర్థమవుతోంది. మరి దీని తెలుగు వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో తమన్నా కథానాయికగా ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కన్నడలో పారుల్ యాదవ్, మలయాళంలో మాంజిమా మోహన్ ఇదే పాత్రలో నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English