చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్

చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్

ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కాలా’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే పదుల సంఖ్యలో విదేశాల్లో పెద్ద ఎత్తున సినిమాను రిలీజ్ చేశారు. అమెరికా.. జపాన్.. మలేషియా లాంటి చోట్ల లోకల్ సినిమాల స్థాయిలో పెద్ద హంగామాతో సినిమా రిలీజైంది. ఎప్పుడూ రజనీ సినిమాలు రిలీజయ్యే దేశాలతో పాటు కొన్ని కొత్త దేశాల్లోనూ ‘కాలా’ను విడుదల చేయడం విశేషం. అందులో సౌదీ అరేబియా కూడా ఉంది. ఈ దేశంలో రిలీజ్ అయిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ఈ చిత్రం చరిత్రకెక్కడం విశేషం.

సౌదీ అరేబియాలో సినిమాల ప్రదర్శనపై 35 ఏళ్లుగా నిషేధం ఉంది. ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంలోనే ‘కాలా’ విడుదలై.. అక్కడ రిలీజైన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. మూడున్నర దశాబ్దాల కిందట అక్కడ చివరగా ‘కింగ్ డమ్’ అనే సినిమాను రిలీజ్ చేశారు. దాని తర్వాత సినిమాలపై నిషేధం కొనసాగుతోంది.

సౌదీలో భారతీయ జనాభా పెద్ద ఎత్తునే ఉండటంతో ఈ చిత్రానికి స్క్రీన్లు బాగానే ఇచ్చారు. ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తాయని భావిస్తున్నారు. ఐతే ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో మిగతా దేశాల్లో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండవని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ రూపొందించిన ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుషే నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు