కండలు పెంచేసి కొత్తగా కనిపిస్తున్నాడు

కండలు పెంచేసి కొత్తగా కనిపిస్తున్నాడు

హీరో అంటే అందంగా.. సున్నితంగా సుకుమారంగా.. ముట్టుకుంటే మాసిపోయే చందంగా ఉండాలనే ఫీలింగ్ రానురాను తగ్గిపోతోంది. సీనియర్ హీరోలే ఫిట్నెస్ తో ఇరగదీస్తుంటే.. తాము ఇంకెంతగా రచ్చ చేయాలో అన్నట్లుగా యంగ్ హీరోలు హల్ చల్ చేస్తున్నారు.

హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్.. అంటూ ఫిట్నెస్ ఛాలెంజ్ టాలీవుడ్ లో తెగ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే యంగ్ హీరో రామ్ ను నందమూరి కళ్యాణ్ రామ్ నామినేట్ చేశాడు. మరి ఇలా తనను నామినేట్ చేసినందుకు ఓ థ్యాంక్స్ కూడా చెప్పిన రామ్ పోతినేని.. ఇప్పుడు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఇందులో డంబుల్స్ తో ప్రాక్టీస్ చేస్తున్న ఎనర్జిటిక్ హీరో మనకు కనిపిస్తాడు. ఎంతో బరువైన డంబెల్ ను సునాయాసంగా ఎన్నిసార్లు లిఫ్ట్ చేశాడో కౌంటింగ్ చేసేయడం కూడా కష్టమేమో. అయితే.. ఈ వీడియోలో కండలు పెంచేసిన రామ్ బాడీ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. రెడీ వంటి సినిమాల్లో ఎంతో సుకుమారంగా కనిపించిన ఈ హీరో.. ఇప్పుడు ఎన్నేసి ప్యాకులు చేస్తున్నాడో అనిపించక మానదు.

'ముందే ప్రామిస్ చేసినట్లుగా ఈ వీడియో ఇస్తున్నా.. నన్ను నామినేట్ చేసినందుకు నందమూరి కళ్యాణ్ బ్రదర్ కు థ్యాంక్యూ. ఇప్పుడు నేను నాకు ఎంతో ఇష్టమైన ఫ్యాన్స్ అండ్ ఫాలోయర్స్ ను నామినేట్ చేస్తున్నాను. మీరు కూడా వీడియోలు పెట్టి ఇరగదీసేయండి' అంటూ చెప్పుకొచ్చాడు ఎనర్జిటిక్ హీరో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English