పిల్లల కోసం పెళ్లే కావాలంటున్న బ్యూటీ

పిల్లల కోసం పెళ్లే కావాలంటున్న బ్యూటీ

ఈ మధ్య రకరకాల మాటల తూటాలు హీరోయిన్ల నుంచి వింటూనే ఉన్నాం. కొంతకాలం క్రితం అయితే.. ప్రియాంక చోప్రా ఓ డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. మగవాళ్ల అవసరం పిల్లల కోసమే అని.. అంతకు మించి వారితోనే లైఫ్ అనే మాటల్లో అర్ధం లేదనే తరహాలో మాట్లాడింది. మరీ ఇలా కాకపోయినా.. ఇందుకు దగ్గరగా మాట్లాడే సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంటుంది.

కానీ ఓ హీరోయిన్.. అందులోను యంగ్ జనరేషన్ బ్యూటీ మాత్రం పక్కాగా పెళ్లే కావాలని చెబుతోంది. లివిన్ రిలేషన్ అంటూ.. ఈ మధ్య కాలంలో కలిసి జీవించడాలు ఎక్కువ కనిపిస్తున్నా.. సినిమా ఫీల్డ్ లోనే ఇవి ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతున్నా.. తాను మాత్రం దీన్ని నమ్మనని అంటోంది. అసలు తనకు లివిన్ రిలేషన్ షిప్ అనే దానిపై నమ్మకమే లేదని తేల్చేసింది బాలీవుడ్ కుర్ర బ్యూటీ ఆలియా భట్. పిల్లలు కావాలంటే.. తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలనే పద్ధతిని తాను విశ్వసిస్తానని.. తనకు ఏజ్ వచ్చినప్పటి నుంచి అదే ఫీలింగ్ ఉందని.. తాను అదే చేస్తానని చెబుతోంది ఆలియా.

అయితే.. తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేదట. కానీ 30 ఏళ్ల వయసు వచ్చేలోపే పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యం లేదని నవ్వుతూ చెబుతోంది యంగ్ బ్యూటీ. తనకు ఎప్పుడు పిల్లలు కావాలని అనిపిస్తే.. అప్పుడు పెళ్లికి రెడీ అయిపోతానని ఆలియా చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు