ఎన్టీఆర్ వాచీ అంత ఖరీదు కాదు..

ఎన్టీఆర్ వాచీ అంత ఖరీదు కాదు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండువారాల క్రితం పుట్టిన రోజు జరుపుకున్నాడు. కొత్త సినిమా అప్ డేట్స్ ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తెరకెక్కుతున్న మూవీ పేరు అరవింద సమేత అంటూ చెప్పడమే కాదు.. ఫస్ట్ లుక్ పోస్టర్లతో రచ్చ రచ్చ చేశాడు.

ఇదే సమయంలో ఎన్టీఆర్ కు తన సోదరుడు కళ్యాణ్ రామ్ నుంచి ఓ మాంచి గిఫ్ట్ కూడా అందుకున్నాడు. ఓ ఖరీదైన వాచ్ ను బ్రదర్ కు బహుమతి ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ వాచీ గురించి మీడియాలో బోలెడన్ని కథనాలు వచ్చాయి. ఫారిన్ నుంచి స్పెషల్ గా తెప్పించి మరీ ఈ వాచ్ ను ఎన్టీఆర్ కు బహూకరించాడని అన్నారు. దాని రేటు కోటి రూపాయలకు పైగానే ఉంటుందని కూడా మీడియాలో న్యూస్ వచ్చాయి. అయితే.. ఇందులో వాస్తవం లేదట. వాచ్ బహుమతి విషయం నిజమే కానీ.. ఇది విదేశాల నుంచి తెప్పించింది మాత్రం కాదట.

అలాగే కోటి రూపాయల వాచ్ అనే మాట కూడా ఒట్టిదే అని తెలుస్తోంది. హైద్రాబాద్ లోనే ఓ లగ్జరీ వాచ్ షోరూంలో చాలా సేపు షాపింగ్ చేసిన కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ కోసం అక్కడ ఉన్న వాచీలలో ఖరీదైనది కొని గిఫ్ట్ ఇచ్చాడట. అయితే.. దీని రేటు కోటి మాత్రం కాదని.. కానీ కాస్ట్ మాత్రం ఎక్కువే అని అంటున్నారు. ఏమైనా ఈ అన్నదమ్ముల బాండింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ మధ్య కళ్యాణ్ రామ్ మూవీ ప్రమోషన్ కు ఎన్టీఆర్ రాకపోవడంతో ఏదో విబేధాలు వచ్చాయనే వార్తలన్నీ.. ఒట్టి పుకార్లే అని ఈ గిఫ్టింగ్ చూస్తే అర్ధమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు