ఆ సెటైర్లను చూసి అవాక్కయ్యారట

ఆ సెటైర్లను చూసి అవాక్కయ్యారట

మంచి టేస్ట్ ఉన్న దర్శకుడుగా ఇంద్రగంటి మోహనకృష్ణకు మంచి గుర్తింపే ఉంది. ఇప్పటివరకూ తీసిన సినిమాలు అన్నీ జనాలను బాగానే నవ్వించగలిగాయి. సెన్స్ లేని కామెడీని అస్సలు ఇష్టపడని ఈ డైరెక్టర్.. తన టేస్ట్ ను ప్రతీ సినిమాలోనూ చూపుతూ ఉంటాడు.

ఇప్పుడు సమ్మోహనం అంటూ సుధీర్ బాబు- అదితి రావు హైదరి జంటగా ఓ చిత్రాన్నిరిలీజ్ కి రెడీ చేశాడు ఈ దర్శకుడు. ఈ నెల 15న సమ్మోహనం థియేటర్లలోకి వచ్చేయనుంది. అయితే.. సమ్మోహనం మూవీలో కామెడీ బాగానే పేలుతుందట. ఈ కామెడీలో భాగంగానే రివ్యూలు వెబ్ సైట్ల మీద సెటైర్లు వేశాడట డైరెక్టర్. వీటిలో చాలావరకు ఛానళ్లు.. మీడియాను టార్గెట్ చేసే ఉంటాయని.. పైగా ఆ కౌంటర్లు కూడా బాగానే పేలాయని అంటున్నారు. ఒకవైపు హీరోయిన్ అదితి రావు పాత్రను.. సినిమా హీరోయిన్ గా చూపుతూ ఇండస్ట్రీని హైలైట్ చేస్తూనే.. మరోవైపు మీడియాను విపరీతంగా విమర్శించాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

దర్శకుడిపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను కొందామని అనుకున్న ఓ బడా ఛానల్ యాజమాన్యం.. ఈ సెటైర్లను చూసి అవాక్కయిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్స్ ను టోన్ డౌన్ చేయమంటూ డైరెక్టర్ కు సలహా కూడా ఇచ్చాడట ఆ ఛానల్ హెడ్. సిల్వర్ స్క్రీన్ పై సినిమా కొన్ని వారాలు ఆడిన తర్వాత.. టీవీ ఛానల్స్ లోకి రావాల్సిందే. టీవీ ఛానల్స్ కు శాటిలైట్ రైట్స్ అమ్ముకోకుండా సినిమా తీయాలని మేకర్స్ అనుకోరు.

అలాంటి పరిస్థితిలో.. తమ ఛానల్ పై సెటైర్ వేయించుకుంటూ ఆ సినిమాను తమ ఛానల్ లో ప్రసారం చేసేందుకు ఏ టీవీ ఛానల్ యాజమాన్యం ముందుకు రాదనే సత్యాన్ని.. ఆ టీవీ ఛానల్ హెడ్.. ఇంద్రగంటిని పిలిపించి మరీ వివరించాడట. నిజానికి ఇంద్రగంటి ఇప్పటివరకూ తీసిన సినిమాలు అన్నీ హెల్దీ కామెడీ బేస్డ్ గానే ఉంటాయి. అమీతుమీ వంటి ఆకట్టుకునే సినిమాలు తీసిన చరిత్ర ఉంది. మరి ఇప్పుడు నిజంగానే మీడియాను నేరుగా విమర్శించే సినిమాను ఇంద్రగంటి తీశాడా.. లేక ఇవన్నీ రూమర్లేనా అనే విషయం తేలాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు