నా దగ్గర వెయ్యి కోట్లున్నాయి

నా దగ్గర వెయ్యి కోట్లున్నాయి

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ నటీనటుల లిస్ట్ లో శింబు పేరు టాప్ లో ఉంటుందని చెప్పాలి. తరచు వివాదాస్పద కామెంట్స్ చేయడం ఈ ఫ్యామిలీ వారికి అలవాటే. ఇక సినిమాల్లో కూడా అదే తరహా వాతావరణం కనిపిస్తుంది. చాలా సినిమాల్లో ఈ హీరో ఇతరులపై సెటైర్ ఈజీగా వేస్తుంటాడు. అలాగే లవ్ ఏఫైర్స్ గురించి కూడా ఘాటుగా స్పందించడం మనోడికి అలవాటే. తనపై తానే కౌంటర్ వేసేసుకుంటాడు.

ఇక రీసెంట్ గా శింబు తన పిఆర్ టీమ్ తో ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయించాడు. అందులో శింబు ఎవరు ఊహించని విధంగా పేర్కొనడం వైరల్ అయ్యింది. నేను నా తండ్రితో మొదటి సినిమా చేసినప్పుడు నాకు ఇష్టమైన సమయానికి వచ్చేవాడిని. 10 గంటల తరువాత షూటింగ్ లో ఉండే వాడిని. ఎందుకంటే నాకు ఇతరుల గురించి అవసరం లేదు. ఎదో ఒక టైమ్ కి రావాలి అని మెషిన్ లా పని చేయలేను.

నాకు ఇష్టం ఉన్నట్లు జీవిస్తాను. నా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా బ్రతికేంత డబ్బు నేను సెట్ చేసుకున్నాను. దానితో హ్యాపీగా బ్రతకగలను. 1000 కోట్ల వరకు నాకు ఆస్తులు ఉన్నాయి. దానితో దర్జాగా బ్రతకగలను. చాలా మంది ఇంకా సినిమాలెందుకు అని అంటుంటారు. కానీ నాకు సినిమాలంటే ఇష్టం. కేవలం ఇష్టపూర్వకంగానే సినిమాలు చేస్తున్నాను. నాకు నచ్చిన విధంగా ఉంటాను అని శింబు పేర్కొన్నాడు.    

అయితే రజనీకాంత్ అండ్ చిరంజీవి దగ్గర కూడా 1000 కోట్లు ఉన్నాయా అంటే మనం సందేహిస్తాం.. ఈ సమయంలో శింబు తన దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి అని చెప్పడంతో.. ఇదంతా ఏదన్నా జోక్ అన్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు