ఆ స్టార్ హీరోకి అందుకే దూరందూరం

ఆ స్టార్ హీరోకి అందుకే దూరందూరం

ఆయనో పెద్ద స్టార్ హీరో. రీసెంట్ టైంలో మరెవరికీ సాధ్యం కానంత రేంజ్ లో హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేసి.. రీసెంట్ గానే దానిని బ్రేక్ చేసుకున్నాడు. సహజంగా ఈ రేంజ్ లో ఉన్న సినిమాలు హీరోలకు చకచకా వచ్చేస్తుంటాయి. కానీ ఈ హీరో మాత్రం.. ఒకటి పూర్తి అయ్యి దాని రిజల్ట్ ను కూలంకషంగా పరిశీలించుకున్న తర్వాతే.. అప్పుడు నెక్ట్స్ మూవీ ఎలాంటిది చేయాలనే ఆలోచనలోకి వస్తుంటాడు. అందుకే ఈ స్టార్ కు కొత్త సినిమా మొదలుపెట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది.

అయితే.. ఈ గ్యాప్ లో కథా కమామీషులను బాగానే వింటాడట. కానీ ఎవరు కథ చెప్పినా సరే.. ఈయన గారి సలహాలు.. ఛేంజోవర్లు.. మేకోవర్లు మాత్రం బోలెడన్ని పడతాయట. ఆ సీన్ అలా కాదు.. ఆ ఎమోషన్ ఇలా కాదు.. ఇది అలా ఉంటే ఇలా ఉంటుంది అని తనే హంగామా చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఆ కథను పట్టుకొచ్చిన డైరెక్టర్ ఎలాంటి వాడు అయినా సరే.. మొత్తం స్క్రిప్టును 50శాతం కిచిడీ చేసి పారేస్తాడని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

తీరా ఆ కథ పట్టుకొచ్చింది కాసింత కొత్తోడయితే.. తనకు కథ ఇచ్చేయమని.. తనే డైరెక్ట్ చేయించుకుంటానంటూ ప్రపోజల్ పెడతాడని చెబుతున్నారు. ఇంతకీ వేరే రైటర్లు కథ పట్టుకువస్తే.. దగ్గరుండి ఈయనకు జాగ్రత్తగా డైరెక్ట్ చేసి పెట్టే దర్శకులు ఎవరు అన్నది కూడా ప్రశ్నార్ధకమే. అయినా సరే ఈ హీరోగారి డైలాగ్ సేమ్ ఉంటుందట. అందుకే పెద్ద స్టార్ అయినా.. భారీ వసూళ్లలు రాబట్టుకునే అవకాశం ఉన్నా.. స్టార్ డైరెక్టర్లు దూరం జరుగుతున్నారని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు