ఏంటి చరణ్.. #RRR హింట్ ఇచ్చావా?

ఏంటి చరణ్.. #RRR హింట్ ఇచ్చావా?

ఎన్ని సినిమాల గురించి మాట్లాడుకుంటున్నా.. #RRR గురించిన అప్ డేట్స్ మాత్రం తెగ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇంకా ఈ సినిమా సెట్స్ కే వెళ్లలేదు. అయినా సరే.. ఎప్పుడెప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్- ఎన్టీఆర్ హీరోలుగా రూపొందే సినిమా చూద్దామా అనే ఆతృత జనాల్లో కనిపిస్తోంది.

ఈ మూవీలో హీరోల క్యారెక్టరైజేషన్స్ గురించి చాలానే మాటలు వినిపించాయి. వీటిలో హీరోలిద్దరూ బాక్సర్లుగా కనిపిస్తారనే ప్రచారం గట్టిగానే జరిగింది. కానీ స్వయంగా చరణ్ ఈ మాటలను ఖండించడంతో.. అందరూ సైలెంట్ కావాల్సి వచ్చింది. కానీ రీసెంట్ ఎపిసోడ్ ఒకటి గమనిస్తే మాత్రం.. ఈ బాక్సింగ్ కహానీ నిజమే అనిపిస్తుంది. ఎన్టీఆర్ విసిరిన ఫిట్నెస్ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన రామ్ చరణ్.. తెగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేస్తూ వీడియోను నెట్ లో పోస్ట్ చేశాడు. ఫిట్నెస్ వర్కవుట్స్ చేస్తున్నట్లు వేరే ఏ వీడియో అయినా షేర్ చేయచ్చు. కానీ పర్టిక్యులర్ బాక్సింగ్ వీడియోనే షేర్ చేయడం వెనక సీక్రెట్ ఇదే అనే విశ్లేషణలు వస్తున్నాయి.

అప్పట్లో చెర్రీ-ఎన్టీఆర్- రాజమౌళి కలిసి ఓ ఫోటో దిగి నెట్ లో పెట్టారు. అప్పుడు వీరు ముగ్గురూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని ఎవరూ గెస్ చేయలేకపోయారు.  ఎవరికీ అర్ధం కాలేదు కూడా. కొంతకాలం తర్వాత #RRR అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పుడు ఓ ఫోటో ద్వారా #RRR టీం హింట్ ఇవ్వగా.. ఇప్పుడు తన బాక్సింగ్ వీడియోతో మెగా పవర్ స్టార్ ఇచ్చిన క్లూ అర్ధం చేసుకోవాలని చెబుతున్నారు ఫ్యాన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English