సూపర్ స్టార్‌ కు సిసలైన పరీక్ష

సూపర్ స్టార్‌ కు సిసలైన పరీక్ష

సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్లో ఓ పెద్ద సవాలుకు సిద్ధమయ్యాడు. ఆయన కొత్త సినిమా ‘కాలా’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. మామూలుగా రజనీ సినిమా అంటే కాంబినేషన్ తో సంబంధం లేకుండా క్రేజ్ వచ్చేస్తుంది. కానీ ‘కాలా’కు ఆశ్చర్యకరంగా అంత బజ్ లేదు. ఇదే దర్శకుడు పా.రంజిత్ తో కలిసి ఇంతకుముందు ఆయన చేసిన ‘కబాలి’ రెండేళ్ల కిందట ప్రకంపనలు రేపింది. దానికి హైప్ మామూలుగా లేదు. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమవడంతో రజనీ-రంజిత్ కాంబోలో వస్తున్న తర్వాతి సినిమాపై ఆ ప్రభావం బాగానే పడింది. ఈ సినిమాకు సరైన బిజినెస్ జరగలేదు. ప్రి రిలీజ్ బజ్ లేక బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగా నడిచాయి.

ఈ నేపథ్యంలో సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి.. అంతిమంగా ఫలితం ఎలా ఉంటుంది.. అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో రుజువు చేశాడు సూపర్ స్టార్. సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్‌ ను ఎంతగానో పెంచిన ఘనత ఆయన సొంతం. ఆ సినిమా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేశాయి. ఇప్పుడు రజనీ మరోసారి తన సత్తా ఏంటో చూపించి.. ‘కాలా’ను పైకి లేపాల్సిన స్థితిలో ఉన్నాడు.

సినిమా ఎలా ఉన్నా తన మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించడం రజనీకి అలవాటే. మరి ‘కాలా’తో అలాగే మెస్మరైజ్ చేసి.. ప్రేక్షకుల్ని మెప్పిస్తాడా.. విడుదల తర్వాతైనా సినిమాకు బజ్ పెరిగేలా.. వసూళ్లు పుంజుకునేలా చేస్తాడా అన్నది చూడాలి. రజనీ అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి.. నానా పటేకర్ కీలక పాత్రలు పోషించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు