ఆ న‌టితో మిధున్ కొడుకు పెళ్లి!

ఆ న‌టితో మిధున్ కొడుకు పెళ్లి!

బాలీవుడ్‌లో ఈ మ‌ధ్య‌న పెళ్లిళ్ల జోరు పెరుగుతోంది. వ‌రుస పెట్టి మ‌రీ ప‌లువురు తార‌లు పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తెలిసిందే. ఇప్ప‌టికే స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన సోన‌మ్ క‌పూర్ పెళ్లి గ్రాండ్ గా జ‌ర‌గ్గా.. మ‌రో హీరోయిన్ నేహా ధూపియా పెళ్లి జ‌రిగింది.

ఈ క్ర‌మంలో మ‌రో సెల‌బ్రిటీ పెళ్లికి రంగం సిద్ధ‌మ‌వుతోంది.  ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు.. మాజీ ఎంపీ మిథున్ చ‌క్ర‌వ‌ర్తి కుమారుడు మ‌హ‌క్ష‌య్ చ‌క్ర‌వ‌ర్తి పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ న‌టి మ‌దాల‌స శ‌ర్మతో పెళ్లి జ‌ర‌గ‌నుంది. పెళ్లి డేట్ ను ఫిక్స్ చేశారు. జులై 7న త‌మ పెళ్లి డేట్ గా మ‌దాల‌స స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

మూడేళ్లుగా తాను.. మ‌హాక్ష‌య్ రిలేష‌న్ షిప్ లో ఉన్నామ‌ని.. త‌మ రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావ‌టంతో త‌మ విష‌యం వారికేమీ ఆశ్చ‌ర్యంగా అనిపించ‌లేద‌న్నారు. ఇరు క‌టుంబాల అంగీకారంతో త‌మ పెళ్లి వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు చెప్పారు. మార్చిలో త‌మ ఎంగేజ్ మెంట్ జ‌రిగింద‌ని.. త‌మ‌ది ల‌వ్ క‌మ్ అరేంజ్డ్ మ్యారేజ్ గా ఆమె అభివ‌ర్ణించారు.

త‌మ పెళ్లి వేడుక ఎక్క‌డ జ‌రిగేది ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని.. ముంబ‌యిలో మాత్రం జ‌ర‌గ‌ద‌ని ఆమె చెప్పారు. త‌మ‌ది డెస్టినేష‌న్ వెడ్డింగ్ అని చెప్పిన ఆమె.. స‌ద‌రు డెస్టినేష‌న్ మాత్రం వెల్ల‌డించ‌లేదు. మ‌రోవైపు.. కొత్త బంగారు లోకం మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన శ్వేత‌బ‌సు ప్ర‌సాద్ సైతం ఒక బాలీవుడ్ ద‌ర్శ‌కుడ్ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రానున్న రోజుల్లో మ‌రెన్ని పెళ్లిళ్లు తెర మీద‌కు వ‌స్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు