మరో తరుణ్ అయ్యేలా ఉన్నాడే..

మరో తరుణ్ అయ్యేలా ఉన్నాడే..

విజయం సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అంటారు పెద్దోళ్లు. సినీ రంగంలో ఇది మరింత బలంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ మామూలుగానే సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. ఎంత పెద్ద విజయాలు సాధించినా.. ఏ రేంజికి వెళ్లినా.. అక్కడే ఉంటామన్న గ్యారెంటీ ఏమీ లేదు. క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ ఎప్పుడూ నిలబడి ఉంటాయనుకోవడానికేమీ లేదు. గతంలో మంచి స్థాయికి వెళ్లి ఆ తర్వాత కింద పడ్డ సెలబ్రెటీలు చాలామందే ఉన్నారు. అందుకు తరుణ్.. ఉదయ్ కిరణ్ లాంటి వాళ్లు ఉదాహరణ.


ఈ ఇద్దరు యువ కథానాయకులు 2000 ప్రాంతంలో తిరుగులేని స్థాయిలో ఉన్నారు. కెరీర్ ఆరంభంలో పెద్ద విజయాలందుకుని యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక తర్వాతి స్థాయికి ఎదుగుతారని అనుకుంటే సినిమాల ఎంపికలో పొరబాట్లు చేసి వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. క్రమంగా ఫాలోయింగ్ అంతా పోయింది. కనుమరుగైపోయారు. ఇప్పుడు ఈ కోవలోకే చేరేలా ఉన్నాడు రాజ్ తరుణ్.

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా అనుకోకుండా ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా మారాడు రాజ్. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. నిజానికి దర్శకుడిగా మారాలనుకుని వచ్చి.. ‘ఉయ్యాల జంపాల’కు దర్శకత్వ విభాగంలో పని చేస్తూనే.. అనుకోకుండా ఆ చిత్రంలోనే హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘కుమారి 21 ఎఫ్’.. ‘సినిమా చూపిస్త మావ’ మంచి హిట్లవడంతో హీరోగా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కోటి రూపాయల పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగాడు. కానీ పైన చెప్పుకున్న హీరోల మాదిరే ఇతనూ సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేశాడు. వరుస పరాజయాలు కొని తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది ‘రంగుల రాట్నం’.. ‘రాజు గాడు’ రాజ్‌ను బాగా దెబ్బ తీశాయి. ‘రాజుగాడు’తో అతడి మార్కెట్ పూర్తిగా దెబ్బ తినేసింది. ఇకపై రాజ్ సినిమాల పట్ల ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English