తెలుగు నటిని ఆ దర్శకుడు అంత హర్ట్ చేశాడట

తెలుగు నటిని ఆ దర్శకుడు అంత హర్ట్ చేశాడట

తెలుగులో నిర్మలమ్మ, అన్నపూర్ణల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంతటి గుర్తింపు సంపాదించిన నటి సుధ. వందల సినిమాల్లో ఆమె క్యారెక్టర్ రోల్స్ చేసి మంచి గుర్తింపు సంపాదించారు. తెలుగు పరిశ్రమ ఆమెను ఎంతో గౌరవిస్తుంది. అలాంటి నటిని ఒక తమిళ దర్శకుడు తీవ్రంగా అవమానించాడట. అనరాని మాట అన్నాడట. ఆమె కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడట.

ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుధ ఈ ఉదంతం గురించి గుర్తు చేసుకున్నారు.
సుధను అంతగా బాధ పెట్టిన దర్శకుడు మరెవరో కాదు.. ‘7/జి బృందావన కాలనీ’.. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా కట్టి పడేసిన సెల్వ రాఘవన్. ‘బృందావన కాలనీ’ షూటింగ్ సందర్భంగా సుధను అతను హర్ట్ చేశాడట. ఒక రోజు షూటింగ్ అయ్యాక రాత్రి ఏడుగంటలకు సుధను ఇంటికి పంపించేస్తామని చెప్పాడట సెల్వ. కానీ రాత్రి 11 అయినా కూడా ఆమె అక్కడే ఉండాల్సి వచ్చిందట.

ఈ విషయమై కో డైరెక్టర్ని పిలిచి మాట్లాడిందట సుధ. అతనెళ్లి సెల్వకు విషయం చెబితే.. ఆమెనుద్దేశించి దారుణమైన మాట అన్నాడట సెల్వ. దీంతో ఆమెకు దు:ఖం తన్నుకొచ్చేసిందట. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లి గదిలో తలుపేసుకున్నారట ఆమె. తర్వాత విషయం తెలిసి నిర్మాత రత్నం సెల్వను మందలించాడట. ఈ చిత్ర తమిళ వెర్షన్‌కు సుధ డబ్బింగ్ వద్దని వేరే వాళ్లను ట్రై చేశాడట సెల్వ.

కానీ ముగ్గురిని ట్రై చేస్తే ఎవ్వరూ పాత్రకు తగ్గ ఎమోషన్ క్యారీ చేయలేకపోయారట. చివరికి సుధనే ఈ పాత్రకు తమిళంలోనూ డబ్బింగ్ చెప్పారట. అది పూర్తయ్యాక సెల్వ రాఘవన్ దండం పెట్టి.. ఇంతకముందు జరిగిందానికి సారీ చెప్పాడని సుధ వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English