చెయ్-అఖిల్ బాగా హర్ట్ అయ్యారట

చెయ్-అఖిల్ బాగా హర్ట్ అయ్యారట

అక్కినేని నాగార్జున తన లేటెస్ట్ మూవీ ఆఫీసర్ మూవీ విషయంలో ముందు నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. వర్మ తన శైలిని మార్చుకుంటాడని ఆశిస్తున్నానని.. కేవలం కథ మీదే పని చేయమని చెప్పానని.. మళ్లీ మళ్లీ తిప్పుకున్నానని బాగానే కబుర్లు చెప్పారు. తీరా సినిమా రిలీజ్ సమయానికి వచ్చేసరికి ఆయనలో కూడా అనుమానం తలెత్తినా.. బైటకు చెప్పే పరిస్థితి అయితే కాదు.

ఇప్పుడు ఆఫీసర్ వచ్చిన సంగతి మరిచిపోయి.. కొత్త సోమవారం రాగానే మళ్లీ తన పని తాను చేసుకుంటున్నట్లు స్వయంగా చెప్పుకొచ్చారు. అంటే.. ఆఫీసర్ షాక్ ను తాను త్వరగానే మర్చిపోతానని చెప్పారాయన. అయితే.. నాగ్ ఆఫీసర్ ఫ్లాప్ ను.. డిజాస్టర్ ను మరచిపోయినా.. ఆయన పిల్లలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. నాగ్ అండ్ అఖిల్ ఒకే ఇంట్లో ఉంటారు. కానీ చైతు మాత్రం వేరేగా నివాసం ఉంటున్నాడు. రీసెంట్ గా ఈ ముగ్గురు ఒకే చోటకు చేరే సందర్భం ఒకటి వచ్చింది.

ఓ స్పోర్ట్స్ లీగ్ ఈవెంట్ సందర్భంగా నాగ్-చైతు-అఖిల్ కలవగా.. అక్కడ వారిద్దరూ చాలా ఎమోషనల్ అయిపోయారట. తమ సినిమాలు ఆడకపోయినా ఆ సంగతి వేరు కానీ.. తండ్రి నుంచి మరీ ఇలాంటి దారుణమైన ఫలితం ఇచ్చే చిత్రం అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదని అన్నారట చైతు- అఖిల్. ఆఫీసర్ ఫ్లాప్ కి కూడా ఫీల్ కాలేదు కానీ.. చెయ్-అఖిల్ ఇంతగా బాధపడిపోవడం చూసి మాత్రం ఆఫీసర్ నాగ్ బాగా హర్ట్ అయ్యారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు