నాగ్ ఫ్యామిలీని వ‌దిలేయాలంటూ వ‌ర్మ‌కు పాలాభిషేకం

నాగ్ ఫ్యామిలీని వ‌దిలేయాలంటూ వ‌ర్మ‌కు పాలాభిషేకం

నాగ్ ఫ్యాన్స్ కు ఏమైంది?  ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆఫీస‌ర్ మూవీ లాంటి భారీ డిజాస్ట‌ర్ త‌ర్వాత కూడా వ‌ర్మ‌కు నాగ్ ఫ్యాన్స్ పాలాభిషేకం చేయ‌టం ఏమిటి? అన్న డౌట్ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. సాఫ్ట్ గా నాగ్ ఫ్యాన్స్ ఇచ్చిన షాక్ తో వివాదాల వ‌ర్మ‌కు దిమ్మ తిరిగిపోవ‌టం ఖాయ‌మ‌ట‌.

ఏళ్ల గ్యాప్ త‌ర్వాత నాగార్జున‌తో మూవీ చేసే చాన్స్ ను వ‌ర్మ ద‌క్కించుకున్నారు. ఇరువురి కాంబినేష‌న్ ఎంత భారీగా వ‌ర్క్ వుట్ అయ్యిందో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ వీరిద్ద‌రితో క‌లిపి సినిమా వ‌స్తుందంటే చాలానే అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల కాలంలో వ‌ర్మ‌ ప్లాపుల మీద ప్లాపులు తీస్తున్న నేప‌థ్యంలో నాగ్ సినిమా మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి.

వీటిని నిజం చేస్తూ.. ఆఫీస‌ర్ సినిమా భారీ డిజాస్ట‌ర్ గా న‌మోదైంది. ఇదిలా ఉంటే.. ఆఫీస‌ర్ మూవీ చేస్తున్న టైంలోనే వ‌ర్మ త‌న త‌ర్వాతి సినిమాను నాగ్ చిన్న కొడుకు అఖిల్ తో మూవీ ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు.ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో నాగ్ కూడా ధ్రువీక‌రించారు.

ఆఫీస‌ర్ చేదు అనుభ‌వంతో అఖిల్ తో ఆట‌లొద్ద‌న్న‌ది నాగ్ ఫ్యాన్స్ తాజా అప్పీల్‌. ఇందులో భాగంగా నాగ్ ఫ్యాన్స్ గాంధీ గిరిని నిర్వ‌హించారు. వివాదాల వ‌ర్మ‌కు మంట పుట్టేలా చేయ‌కుండా.. వారు వినూత్నంగా నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌ర్మ నిలువెత్తు క‌టౌట్‌ను ఏర్పాటు చేసి.. దానికి పాలాభిషేకాన్ని నిర్వ‌హించారు. ద‌య‌చేసి నాగ్ ఫ్యామిలీని వ‌ర్మ విడిచి పెట్టాలంటూ వేడుకున్నారు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు