రాజమౌళి సెల్ఫీలో వాళ్లెందుకు మిస్సయ్యారు?

రాజమౌళి సెల్ఫీలో వాళ్లెందుకు మిస్సయ్యారు?

హీరోలేనా ఏంటి కలిసిపోయేది.. మేం కలవమా అన్నట్లుగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో చాలామంది ఒకచోటికి చేరారు. అందులో దర్శక ధీరుడు రాజమౌళితో పాటు సుకుమార్.. కొరటాల శివ.. సందీప్ రెడ్డి వంగా.. హరీష్ శంకర్.. అనిల్ రావిపూడి.. ఇలా చాలామందే ఉన్నారు. వంశీ పైడిపల్లి ఇంట్లో వీళ్లందరూ కలిశారు. తెల్లవారుజామున నాలుగింటి వరకు ముచ్చట్లు సాగాయంటే వీళ్లందరూ ఎంతగా ఎంజాయ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

స్వయంగా రాజమౌళి అందరితోనూ కలిసి సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఆసక్తి రేకెత్తించింది. ఐతే ఈ పిక్ చూశాక.. ఇందులో మిస్సయిన వాళ్లెవరంటూ డిస్కషన్లు మొదలయ్యాయి. ఈ ఫొటోలో ఉన్న వాళ్లలో మెజారిటీ దర్శకులు విజయాల్లో ఉన్నవాళ్లే. చాలామంది ఈ ట్రెండుకు తగ్గట్లు విభిన్నంగా సినిమాలు తీస్తారని పేరున్న వాళ్లే.

ఈ పిక్‌లో మిస్సయిన ప్రముఖ దర్శకులు.. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను. మరి వీళ్లకేమైంది.. వేరే పనులుండే రాలేదా.. వాళ్లకు ఆహ్వానాలు వెళ్లలేదా అన్నది తెలియదు మరి. మిస్సయిన వాళ్లలో బోయపాటిని మినహాయిస్తే ఎవ్వరూ విజయాల్లో లేరు. సక్సెస్ కోసం స్ట్రగులవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మామూలుగానే బయట ఎవ్వరితోనూ కలవడు కాబట్టి పక్కన పెట్టేయొచ్చు.

అందరితో బాగా కలిసే పూరి, వినాయక్ ఇందులో ఎందుకు మిస్సయారో మరి. శ్రీను వైట్ల షూటింగ్ కోసం అమెరికాలో ఉన్నాడంటున్నారు. బోయపాటి కూడా చరణ్ సినిమా షూటింగులో బిజీ. అసలు వీళ్లందరికీ ఆహ్వానాలు వెళ్లాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఐతే కుదిరిన వాళ్లు వచ్చారు.. ఎంజాయ్ చేశారు కాబట్టి.. ఈ విషయంలో మరీ లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English