ఈ హీరో రూటే సెపరేటు

ఈ హీరో రూటే సెపరేటు

స్టార్ హీరోల యాక్టివిటీస్ పై అందరూ ఓ కన్నేసి ఉంచుతారు. ఏ భాషలో అయినా ఇలా ఆరాలు తీయడం కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. తమిళనాడులో ఇవి మరీ ఎక్కువ. ఎందుకంటే.. అక్కడ సినిమారంగం- రాజకీయాలు బాగా పెనవేసుకుపోయాయి. అందుకే ఇక్కడి హీరోల చర్యలపై జనాలతో పాటు అందరూ ఆరా తీస్తుంటారు.

చాలామంది తమిళ హీరోలు తమ రాజకీయ ఉద్దేశాలను ఓపెన్ గానే చెబుతుంటారు. కొంతమంది మాత్రం సైలెంట్ గా పనులు చక్కబెడుతూ ఉంటారు. ఇలయ దళపతి అంటూ ఫ్యాన్స్ తో పిలిపించుకునే కోలీవుడ్ హీరో విజయ్.. పాలిటిక్స్ లోకి వస్తాడో రాడో తెలియదు కాని.. తరచుగా చనిపోయిన వారి తాలూకు కుటుంబాలను సీక్రెట్ గా కలుస్తుంటాడు. తాజాగా స్టెరిలైజ్ షూట్ అవుట్ లో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని కలిసిన విజయ్.. చాలా రహస్యంగా ట్యూటికోరన్ లో వారి ఇంటికి వెళ్లాడు. ఎవరికీ తెలియకుండా.. బైక్ పై వెళ్లి మరీ కలుసుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించిన విజయ్.. వారికి 1 లక్ష రూపాయల సాయం కూడా అందించాడు.

గతంలో నీట్ ఎగ్జామ్ విషయంలో ఒకమ్మాయి చనిపోయినప్పుడు కూడా ఇలాగే చేశాడు. ఇలాంటి సీక్రెట్ ట్రిప్పులు చూస్తుంటే.. ఏదో ఒకరోజు విజయ్ కూడా పవన్ కళ్యాణ్‌ టైపులో సడన్ గా పార్టీ పెట్టేస్తాడా ఏంటి? అనే అనుమానాలు తలెత్తడంలో ఆశ్చర్యం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు