వర్మకు సపోర్ట్ ఇచ్చే బ్యాచ్ వచ్చింది

వర్మకు సపోర్ట్ ఇచ్చే బ్యాచ్ వచ్చింది

రాంగోపాల్ వర్మకు నాగార్జున ఫ్యాన్స్ పలు చోట్ల క్షీరాభిషేకాలు కూడా చేస్తున్నారు. కలలో కూడా తలచుకునేందుకు ఇష్టపడనంత గొప్ప సినిమాను.. అంత గొప్ప రిజల్ట్ ను.. తమ హీరోకు ఆఫీసర్ మూవీ ద్వారా అందించిన వర్మను అనేక మంది విమర్శిస్తున్నా.. ఇక్కడితో వర్మ-నాగ్ బంధం బ్రేక్ పడుతుందనే సంబరంతోనే ఇలా అభిషేకాలు జరుగుతున్నాయి. అఖిల్ తో వర్మ మూవీ కచ్చితంగా ఉండదన్నది వారి ఆనందం.

ఆఫీసర్ మూవీ డిజాస్టర్ ద్వారా.. తన మేకింగ్ ట్యాలెంట్ ఏ రేంజ్ లో దిగజార్చుకున్నాడో వర్మ మళ్లీ ప్రూవ్ చేశాడు. ఆ సినిమాకు ముందేమీ నమ్మకాలు లేవు కానీ.. నాగ్ తో మూవీ అంటే కాస్త జాగ్రత్తపడతాడని.. మళ్లీ ఫామ్ లోకి వస్తాడని.. కాస్త అనుమానం ఉండేది. కానీ మూవీ చేశాక ఫ్యూచర్ లో కూడా వర్మ నుంచి ఎలాంటి అద్భుతాలు ఆశించనక్కర్లేదని ప్రూవ్ అయిపోయింది. అయితే.. ఇలాంటి సమయంలో కూడా వర్మకు సపోర్ట్ గా కొందరు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతూ హల్ చల్ చేస్తుండడం విశేషం.

సినిమా హిట్టయినా ఫ్లాపయినా.. దానిని తాము పట్టించుకోమని.. పాత్ బ్రేకింగ్ మూవీస్ అందించిన వర్మను తాము ప్రేమిస్తామని.. బాక్సాఫీస్ కలెక్షన్స్ తమకు కొలమానం కాదని చెబుతున్న వీరు.. ఆయన ఏం నమ్మితే తాము దాన్నే విశ్వసిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇందుకు మద్దతు పలికేవాళ్ల కౌంట్ కూడా బాగానే ఉంది కానీ.. ఈ తరహా పోస్టులకు వస్తున్న రిప్లైలు అన్నీ పాజిటివ్ గానే.. అంటే వర్మకు సపోర్ట్ గానే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది కూడా ఏదైనా పెయిడ్ ప్రమోషనా ఏంటి అనుకుంటున్నారు నెటిజన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు