ఒక సినిమాకు మూడు టీజర్లా?

ఒక సినిమాకు మూడు టీజర్లా?

తమిళం.. తెలుగు.. హిందీ.. మలయాళం.. ఇలా పలు భాషల్లో ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ హీరోల్లో విక్రమ్ ఒకడు. ఇక గౌతమ్ మీనన్ గురించి చెప్పాల్సిన పని లేదు. దక్షిణాది టాప్ డైరెక్టర్లలో అతనొకడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా అనగానే అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్లు వీరి కలయికలో తెరకెక్కుతున్న ‘ధృవనక్షత్రం’ చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమోలు భలే ఆసక్తి రేకెత్తించాయి. శరవేగంగా షూటింగ్ చేస్తూ.. వరుసబెట్టి ప్రోమోలు రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు గౌతమ్. కానీ ఈ సినిమాకు అనుకోకుండా బ్రేక్ పడింది. సినిమా అతీ గతీ లేకుండా పోయింది. ఇక ఇది ఎప్పటికీ రిలీజ్ కాదన్న సందేహాలు నెలకొన్నాయి. గౌతమ్ టాలెంటెడ్ డైరెక్టరే కానీ.. ప్రొడ్యూసర్‌గా అతడి ప్లానింగ్ పేలవం.

గౌతమ్ ప్రతి సినిమాకూ ఫినాన్షియల్ ఇష్యూస్ కామన్. ఆయన ప్రొడక్షన్లో ఇది కాక ఇంకో రెండు సినిమాలున్నాయి. అవి కూడా ఆగిపోయాయి. ఆ ప్రభావం ‘ధృవ నక్షత్రం’ మీద పడింది. దీని విడుదల సందిగ్ధంలో పడింది. కొన్ని నెలల పాటు అసలు వార్తల్లోనే లేని ఈ చిత్రం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం కొత్తగా రిలీజ్ చేసిన టీజరే. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గని కంటెంట్.. విజువల్స్‌తో కళ్లు చెదిరేలా చేసిందీ చిత్రం. విశేషం ఏంటంటే.. ‘ధృవనక్షత్రం’కు సంబంధించి ఇది తొలి టీజర్ కాదు. మూడోది. గత ఏడాదే రెండు టీజర్లు రిలీజయ్యాయి. స్పై అయిన హీరో తన టీంతో కలిసి ఒక కరడుగట్టిన ఇంటర్నేషనల్ క్రిమినల్‌ పని పట్టే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ కాన్సెప్ట్‌‌కు తగ్గట్లే ఆసక్తికర టీజర్లు కట్ చేస్తున్నాడు గౌతమ్. ఐతే టీజర్లకు తిరుగులేదు కానీ.. ఊరికే ఇలా ఊరిస్తే సరిపోదు. సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలి. అదెప్పుడన్నదే అర్థం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు