నందమూరి సినిమాకి ఘట్టమనేని ముప్పు

నందమూరి సినిమాకి ఘట్టమనేని ముప్పు

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తన పంథా మార్చి మొదటిసారిగా ఒక ప్యూర్‌ లవ్‌స్టోరీ చేసాడు. 'నా నువ్వే' అంటూ అతను చేసిన ఈ చిత్రం చూడ్డానికి కలర్‌ఫుల్‌గానే వున్నా కానీ బిజినెస్‌ పరంగా అంత ఎట్రాక్ట్‌ చేయలేకపోయింది. కళ్యాణ్‌రామ్‌ గత చిత్రాల ఫలితాలు కూడా దీని బిజినెస్‌ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని వేరే సినిమాలతో పోటీగా విడుదల చేయడం కంటే సేఫ్‌గా జూన్‌ 14న వచ్చి రంజాన్‌ వీకెండ్‌ క్యాష్‌ చేసుకుందామని విడుదల వాయిదా వేసారు.

అయితే ఇప్పుడు దీనికి పోటీగా సుధీర్‌బాబు సినిమా 'సమ్మోహనం' తయారైంది. ఈ చిత్రం ట్రెయిలర్స్‌కి వస్తోన్న స్పందన బట్టి ఏ సెంటర్స్‌లో మంచి సినిమా కాగలదనే నమ్మకాలున్నాయి. జూన్‌ 15న ఈ చిత్రం రిలీజ్‌ అవుతుంది కనుక ఏ సెంటర్స్‌ మార్కెట్‌నే టార్గెట్‌ చేస్తోన్న 'నా నువ్వే'కి ఈ చిత్రంతో పెద్ద చిక్కే వచ్చేలాగుంది. ఇప్పుడు ఏ సినిమాకి అయినా మొదటి వీకెండ్‌ రెవెన్యూ కీలకంగా మారింది. ఫస్ట్‌ వీకెండ్‌లో రెవెన్యూ ఈ రెండు సినిమాల మధ్య షేర్‌ అయిపోతే రెండిటికీ ఇబ్బందులు తప్పవు. కానీ ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు అనుకున్న రిలీజ్‌ డేట్‌కే ఫిక్స్‌ అయిపోయాయి. మరి నందమూరి మనవడు వర్సెస్‌ ఘట్టమనేని అల్లుడు మధ్య జరిగే పోటీలో ఎవరిదో పై చేయి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు