సెకండ్‌ హాఫ్‌కి ఎన్టీఆరే దిక్కు!

సెకండ్‌ హాఫ్‌కి ఎన్టీఆరే దిక్కు!

వేసవిలో రంగస్థలం, భరత్‌ అనే నేను, మహానటి చిత్రాలతో బాక్సాఫీస్‌ కళకళలాడింది. ఈ కళని కాస్త తగ్గించేలా చాలానే డిజాస్టర్లు కూడా వచ్చాయనుకోండి. అయితే ఈ యేడాది ద్వితియార్ధంలో మాత్రం బాక్సాఫీస్‌ వద్ద అలజడి చేసే సినిమాలు ఎక్కువ లేవు. ఈ ఇయర్‌ సెకండ్‌ హాఫ్‌లో తెలుగు సినిమా నుంచి 'అరవింద సమేత' మినహా భారీ చిత్రాలేమీ రిలీజ్‌ అవడం లేదు. కొన్ని సినిమాలు ప్లాన్‌ చేసారు కానీ అవన్నీ లేట్‌ అవడంతో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల చిత్రం మాత్రమే ఈ ఇయర్‌ రిలీజ్‌ అవుతోంది. అంటే మిగిలిన ఏడు నెలల్లో మీడియం, లో బడ్జెట్‌, డబ్బింగ్‌ చిత్రాలతోనే తెలుగు సినిమా బాక్సాఫీస్‌ కాలక్షేపం చేయాల్సి వస్తుంది. ఇది ఎన్టీఆర్‌ సినిమాకి కలిసి వచ్చే అంశం.

సాధారణంగా ఒక పెద్ద సినిమా వచ్చి చాలా గ్యాప్‌ వచ్చిన తర్వాత రిలీజ్‌ అయిన సినిమాకి క్రేజ్‌ తారాస్థాయిలో వుంటుంది. యావరేజ్‌ టాక్‌ వచ్చినా కానీ జనం చూసేస్తారు. ఇక హిట్‌ టాక్‌ వస్తే ఆ రెస్పాన్స్‌ విశేషంగా వుంటుంది. సెప్టెంబర్‌లో అరవింద సమేత రిలీజ్‌ అవుతుంది కనుక అప్పటికి పెద్ద సినిమా వచ్చి అయిదు నెలలు పైగానే అవుతుంది. ఈ అడ్వాంటేజ్‌ని ఎన్టీఆర్‌ ఎంతవరకు క్యాష్‌ చేసుకుంటాడో గానీ లాంగ్‌ రన్‌కి కూడా బాగా హెల్ప్‌ అయ్యే పరిణామమిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు