చిరంజీవి-చరణ్‌తో అన్‌హ్యాపీ!

చిరంజీవి-చరణ్‌తో అన్‌హ్యాపీ!

సైరా నరసింహారెడ్డి చిత్రంలో కథానాయికగా నటించేందుకు గాను నయనతారకి రికార్డు రెమ్యూనరేషన్‌ దక్కినట్టు సమాచారం. ఆమెకి తమిళంలో వున్న మార్కెట్‌ దృష్ట్యా ఈ చిత్రానికి నయన ప్లస్‌ అవుతుందని భారీగా చెల్లించి డేట్స్‌ తీసుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడిపేందుకు గాను చిన్న సినిమాలు మాత్రమే తన సౌలభ్యం ప్రకారం చేస్తోన్న నయనతార అయిష్టంగానే 'సైరా' సైన్‌ చేసింది. తన పార్ట్‌ని అక్టోబర్‌లోగా పూర్తి చేస్తామని అప్పట్లో చెప్పారట. కానీ ఈ సినిమా షూటింగ్‌ డిలే అవుతూ వుండడం వల్ల ఇది పూర్తి కావడానికి టైమ్‌ తీసుకుంటుంది. కనీసం జనవరి వరకు నయనతార డేట్స్‌ కావాలని అడగడంతో ఆమె చాలా అసంతృప్తి వ్యక్తం చేసిందట.

అయితే ఇంతటి భారీ బడ్జెట్‌ చిత్రం కనుక, బాహుబలి తర్వాత తెలుగు సినీ పరిశ్రమకి ప్రతిష్టాత్మక చిత్రం కనుక నయనతార ఎక్కువ గొడవ చేయడం లేదని, అయితే తన బాయ్‌ఫ్రెండ్‌ విఘ్నేష్‌కి ఎక్కువ దూరం వుండలేక త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందని, సైరాతో పాటు మరో రెండు కమిట్‌ అయిన సినిమాలు పూర్తి కాగానే నయనతార మిసెస్‌ అయిపోతుందని భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు