‘అఖిల్’ పాపను ఎలా చేశారో చూడండి

‘అఖిల్’ పాపను ఎలా చేశారో చూడండి

కొందరు హీరోయిన్లను చూడగానే మోడర్న్ అన్న భావన కలుగుతుంది. ఇంకొందరిని చూడగానే ట్రెడిషనల్ అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్లపై కలిగే ఈ అభిప్రాయాల్ని బట్టే క్యారెక్టర్లు ఇస్తుంటారు ఫిలిం మేకర్స్. అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అయిన ‘అఖిల్’తో కథానాయికగా పరిచయం అయిన ముంబయి భామ సాయేషాను చూస్తే బాగా మోడర్న్ అనిపిస్తుంది. ఆమెను అలాంటి క్యారెక్టర్లలోనే చూడాలనుకుంటారు ఎవరైనా. కానీ తమిళ దర్శకుడు పాండిరాజ్ ఆమెకు పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్ర ఇవ్వడం విశేషం. కార్తి హీరోగా పాండిరాజ్ రూపొందిస్తున్న విలేజ్ మూవీ ‘చినబాబు’లో సాయేషానే కథానాయిక. ఈ చిత్ర టీజర్ ఇటీవలే రిలీజైంది.

టీజర్లో.. చిత్ర బృందం రిలీజ్ చేసిన మిగతా పోస్టర్లలో సాయేషాను సంప్రదాయబద్ధమైన పల్లెటూరి అమ్మాయి లుక్‌లో చూసి ఆశ్చర్యపోతున్నారంతా. ఆ పాత్రకు ఆమె బాగానే సూటైనట్లుంది. చక్కటి మేకప్ తోడవడంతో సాయేషా ఆడ్‌గా ఏమీ అనిపించట్లేదు. ఇటు తెలుగులో.. అటు హిందీలో సాయేషా తొలి సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి.

తమిళంలో కూడా ఆమె తొలి సినిమా ‘వనమగన్’ ఆడలేదు. అయినప్పటికీ ఆమెకు అక్కడ అవకాశాలకు లోటు లేదు. ప్రస్తుతం కోలీవుడ్లో మూడు సినిమాలు చేస్తోంది సాయేషా. ‘భలే భలే మగాడివోయ్’ రీమేక్ ‘గజినీకాంత్’లో ఆమే హీరోయిన్. దాంతో పాటుగా ‘చినబాబు’ వచ్చే నెల రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇది కాక విజయ్ సేతుపతితోనూ ఓ సినిమాలో నటిస్తోంది సాయేషా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు