అరవింద సమేత.. ఆ ఫైటుకు బ్రేకేసిన ఎన్టీఆర్

అరవింద సమేత.. ఆ ఫైటుకు బ్రేకేసిన ఎన్టీఆర్

క్లాస్ ఆడియన్స్ తో పాటు మాస్ జనాలను కూడా కలిపి మెప్పించగలిగే సినిమాలు తీయడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దిట్ట. మూవీ అంతా క్లాస్ మూవీ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ కంటెంట్ లో మధ్యమధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాల దగ్గరకు వచ్చేసరికి.. మాస్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే షాట్స్ తీస్తుంటాడు ఈ దర్శకుడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ తో తీస్తున్న అరవింద సమేత చిత్రంలో కూడా ఓ ఫైట్ సీక్వెన్స్ ను స్పెషల్ గా ప్లాన్ చేశాడట దర్శకుడు త్రివిక్రమ్. కానీ ఇప్పుడీ ఫైట్ ను ఎన్టీఆర్ రద్దు చేయించినట్లుగా చెబుతున్నారు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీలో.. కళ్లజోడును అడ్డం పెట్టుకుని తీసే ఫైట్ సీక్వెన్స్ సూపర్బ్ గా క్లిక్ అయింది. అరవింద సమేతలో కూడా అందుకు దగ్గరగా అనిపించే ఫైట్ ను ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. వెరైటీగా అనిపించడంతో.. మొదట ఈ ఫైట్ కు ఒప్పుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత మాత్రం వద్దని చెప్పేశాడట.

ఈ ఫైట్ ను ఆన్ స్క్రీన్ పై చూస్తే.. పవన్ ఫైట్ గుర్తుకు వచ్చే అవకాశం ఉందని.. అందుకే ఈ సీక్వెన్స్ వద్దని.. వేరేది డిజైన్ చేయమని చెప్పాడట జూనియర్. హీరో గారి సలహా మేరకు.. క్యాజువల్ గానే ఈ ఫైట్ ఉండేలా తీసినా.. గ్రాఫిక్స్ టచ్ మాత్రం బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ మదిలో ఉన్న ఫైట్.. మరి ఏ హీరోతో తెరకెక్కిస్తాడో కొంత కాలం ఆగితే తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు