కన్ ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో?

కన్ ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో?

యంగ్ హీరో రామ్ ఇప్పుడు ఫుల్లు కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. రెండున్నరేళ్ల క్రితం వచ్చిన నేను శైలజ తర్వాత.. మళ్లీ ఈ ఎనర్జిటిక్ హీరోకు హిట్ అనేది దక్కలేదు. అలాగని ఎక్కువ సినిమాలు కూడా తీయలేదు. వచ్చిన చిత్రాలు పట్టుమని రెండు. ఒకటి హైపర్.. రెండోది ఉన్నది ఒకటే జిందగీ.

ఈ రెండు సినిమాల రిజల్ట్ ఏంటో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం రామ్ చేస్తున్న మూవీ హలో గురూ ప్రేమ కోసమే. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం.. ఆ దర్శకుడి గత రెండు సినిమాల మాదిరిగానే మామా అల్లుళ్ల కాన్ ఫ్లిక్ట్ తో సాగుతుందనే విషయం ఇప్పటికే ప్రచారంలో ఉంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోనుంది కూడా. కానీ ఆ తర్వాత ఏ సినిమా చేయాలి.. అసలు ఏ సబ్జెక్టు ఎంచుకోవాలి అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నాడట రామ్ పోతినేని.

తనకు బాగా ఇష్టమైన జోనర్ అయిన రొటీన్(Routine)గా ఉండే సినిమాలు చేయాలా.. లేక ఇప్పుడు జనాలను మెప్పించడంలో ముందున్న రియలిస్టిక్(Realistic) మూవీకి మొగ్గాలా.. లేకపోతే ఈ రెండూ కాకుండా ప్రస్తుతం ట్రెండ్ కు తగిన విధంగా(Right Trend) ఏదైనా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావాలా అనే అంశాలపై తేల్చుకోలేకపోతున్నాడ రామ్. మరి రామ్ కు #RRR (Routine, Realistic, Right) కన్ ఫ్యూజన్ ఎప్పటికి తీరుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు