అల్లు సారుకి అతనిపై ఇంట్రెస్ట్ ఏంటో?

అల్లు సారుకి అతనిపై ఇంట్రెస్ట్ ఏంటో?

నాని ఇప్పుడు మినిమం గ్యారంటీ ఏంటి.. మాగ్జిమమ్ గ్యారంటీ హీరో అయిపోయాడు. కృష్ణార్జున యుద్ధం ఆడలేదు కానీ.. నాని క్రేజ్ కి వచ్చిన ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు. అయితే.. వెండితెరపై న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని.. ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటేందుకు రెడీ అయిపోయాడు.

కానీ.. తన బుల్లితెర అరంగేట్రం వెనుక.. మొత్తం కథ అంతా నడిపించిన వ్యక్తి అల్లు అరవింద్ అంటూ అసలు విషయం చెప్పేశాడు నాని. ప్రతిభ ఉన్నవాడు.. సహజమైన నటనతో ఆకట్టుకుంటాడు కాబట్టి.. అల్లు అరవింద్ లాంటి కాలిక్యులేటెడ్ నిర్మాత ప్రోత్సహించడంలో ఆశ్చర్యం లేదు. అప్పట్లో గీతాఆర్ట్స్2 అంటూ కొత్త బ్యానర్ పెట్టి మరీ నానితో భలేభలే మగాడివోయ్ సినిమా చేసి.. ఈ హీరో రేంజ్ ను పెంచి డిపెండబుల్ స్టార్ చేసిన ఘనత అల్లు అరవింద్ దే. ఆ తర్వాత ఆ రేంజ్ ను కాపాడుకోవడంలో నాని బాగానే సక్సెస్ అయ్యాడు.

ఇప్పుడు బిగ్ బాస్2 విషయంలో కూడా నాని అయితేనే బాగుంటుందంటూ.. అల్లు అరవింద్ స్వయంగా చొరవ తీసుకుని రంగంలోకి దిగి.. అటు స్టార్ మా ఛానల్ వారిని.. ఇటు నానిని కూడా ఒప్పించి మరీ హోస్ట్ గా కన్ఫాం చేయించారు అల్లు. అటు సినిమాల విషయంలోనూ పెద్ద హిట్ అందించిన నిర్మాత ఈయనే. ఇప్పుడు కొత్త ప్రొఫెషన్ కు సాయం చేసిందీ ఈయనే. ఇంతకీ అల్లు వారికి నానిపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English