రాజమౌళి అక్షయపాత్ర రెడీ!!

రాజమౌళి అక్షయపాత్ర రెడీ!!

సినిమా టైటిల్స్ విషయంలో కొత్తగా థింక్ చేయడం కామన్. అలాగే రాజమౌళి - అక్షయపాత్ర అనగానే.. ఇదేదో #RRRకి పెట్టిన టైటిల్ అని అనుకోకండి. ఇదో ఛారిటీ సంస్థ పేరు. అనేక మంది అన్నార్తులకు ఆకలి తీర్చే సంస్థను తన కుటుంబంతో సందర్శించాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.

హైద్రాబాద్ లోని కోకాపేటలో ఉన్న అక్షయపాత్ర వంటశాలను దర్శించినట్లు చెప్పిన రాజమౌళి.. అసలు ఎక్కడా చేయి ఉపయోగించకుండా.. మనుషుల సాయం లేకుండా.. పూర్తి ఆటోమేటిక్ విధానంలో వంట చేసే ప్లాంట్ ను దర్శించారు. ఆ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆమూలాగ్రం తెలుసుకున్నారు. ఇక్కడకు చేరేందుకు ముందే అక్షయపాత్ర గురించి పలు అంశాలను స్టడీ చేసిన ఆయన.. ఓ భారీ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ ఏడాది మొత్తం అక్షయపాత్ర ద్వారా 2500 మంది పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పాడు రాజమౌళి.

కేవలం 950 రూపాయలు చెల్లించడం ద్వారా ఓ స్కూల్ స్టూడెంట్ కు అన్నం పెట్టే మహోద్యమంలో అందరూ భాగం కావాలంటూ పిలుపునిచ్చిన రాజమౌళి.. అందుకు సంబంధించిన లింక్ షేర్ చేసి.. తన అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారు. అక్షయపాత్ర కుకింగ్ యూనిట్ నుంచి రాజమౌళి ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు