నలుగురు హీరోయిన్ల రచ్చ.. 36.5 కోట్లు

నలుగురు హీరోయిన్ల రచ్చ..  36.5 కోట్లు

సినిమా రిలీజయ్యాక ఓపెనింగ్స్ లో కలెక్షన్స్ కుమ్మేయాలంటే స్టార్ హీరోల వల్లే అవుతుంది. ఒక్క స్టార్ హీరో లేడు. స్టార్ హీరో ఏంటి? మీడియం రేంజి హీరో కూడా లేదు. ఉన్నది నలుగురు అమ్మాయిలు. అందులో ఇద్దరే పెద్ద హీరోయిన్లు. కలెక్షన్లు మాత్రం స్టార్ హీరోల రేంజిలో వస్తున్నాయి. ఇది బాలీవుడ్ లో తాజాగా రిలీజైన వీర్ ది వెడ్డింగ్ సినిమా సాధించిన ఘనత.

వీర్ ది వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ - సోనమ్ కపూర్ - స్వర భాస్కర్ - శిక్ష తల్సానియా లీడ్ రోల్స్ లో నటించారు. యూత్ స్టేజ్ నుంచి పెళ్లి చేసుకునే వరకు నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ ఎలా గడిచిందన్నదే సినిమా కథ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూలు చేస్తోంది. ఈ వీకెండ్ లో ఈ సినిమాకు రూ. 36.52 కోట్లు వచ్చాయి. రిలీజైన ఫస్ట్ వీకెండ్ లో హయ్యస్ట్ వసూలు చేసిన టాప్ 5 హిందీ మూవీస్ లో వీర్ ది వెడ్డింగ్ కూడా చేరిపోయింది. నార్త్ లో కొన్ని ఈ ఏరియాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు రాకింగ్ ఉన్నాయంటూ బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

వీర్ ది వెడ్డింగ్ సినిమాను బాలీవుడ్ కు అలవాటయిన ఫీల్ గుడ్ స్టయిల్లో కాకుండా బోల్డ్ గా తీశారు. నలుగురు అమ్మాయిల గ్లామర్.. బూతు డైలాగులు.. డబుల్ మీనింగ్ తో ఉండే పంచులు ఈ సినిమా నిండా పుష్కలంగా ఉన్నాయి. ఈ మూవీ చూశాక అమ్మాయిలు ఇలా కూడా మాట్లాడుకుంటారా అని అనిపిస్తుందంటే ఎంత మాత్రం తప్పు కాదు. అందుకే హీరోలు లేకపోయినా కలెక్షన్లకు మాత్రం లోటులేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English