కాజల్ తర్వాత రకుల్.. ఎనీ డౌట్స్

కాజల్ తర్వాత రకుల్.. ఎనీ డౌట్స్

ఓ హీరోయిన్ క్రేజ్ లెక్కించడానికి..అన్నిటి కంటే సులువైన సరియైన కొలమానం ఏంటి? ఎన్నిరకాల లెక్కలు ఉన్నా.. అసలు సిసలైన పాయింట్ మాత్రం రెమ్యూనరేషన్ అంతే. ఎవరు ఎక్కువ పుచ్చుకుంటే.. ఎవరికి ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటే.. అమెకే ఎక్కువ క్రేజ్ అండ్ డిమాండ్ ఉన్నాయని అర్ధం.

ఆ రకంగా చూసుకుంటే.. అత్యధిక పారితోషికం పుచ్చుకున్న టాలీవుడ్ భామలలో కాజల్ అగర్వాల్ పేరు ముందు వినిపిస్తుంది. ఒక్కో సినిమాకు 1.5 కోట్ల నుంచి 1.75 కోట్ల వరకూ తీసుకోవడం ఈ భామ స్పెషాలిటీ. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ మొత్తానికి వచ్చేసింది. నాగచైతన్యతో రకుల్ చేయబోతున్న ఓ సినిమా కోసం ఈమెకు ఏకంగా కోటీ 75 లక్షల పారితోషికం ఇచ్చేందుకు మేకర్స్ ఓకే చెప్పేశారట. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం మంచి సక్సెస్ ను సాధించిన సంగతి తెలిసిందే.

నిజానికి స్పైడర్ డిజాస్టర్.. జయ జానకి ఫ్లాప్ తర్వాత రకుల్ కి ఛాన్సులు తగ్గిపోయాయని అంతా భావించారు. ఆమెకు ఉన్న క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గిపోయాయని.. సినిమా ఆఫర్స్ కూడా సరిగా రావడం లేదనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు 1.75 కోట్ల రెమ్యూనరేషన్ లెక్క వింటే మాత్రం.. కాజల్ తర్వాత రకుల్ మాత్రమే అంత మొత్తం అందుకోవడం చూస్తే.. ఆమె స్టార్ డం ఏ మాత్రం తగ్గలేదని అర్ధమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English