మారుతి దెబ్బకి అల్లుడికి పండగే

మారుతి దెబ్బకి అల్లుడికి పండగే

ఫిలిం మేకర్ గా దర్శకుడు కం నిర్మాత అయిన మారుతి రేంజ్ గణనీయంగానే పెరిగిపోతోంది. ముఖ్యంగా మారుతి దర్శకత్వంలో రూపొందే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్స్ ను రూపొందించడంలో తన ట్యాలెంట్ చూపిస్తున్నాడు మారుతి.

ప్రస్తుతం శైలజా రెడ్డి అల్లుడు అంటూ అక్కినేని నాగచైతన్య హీరోగా ఓ ఫిలిం రూపొందిస్తున్నాడు. ఈ మూవీ బిజినెస్ రేంజ్ చూసి ట్రేడ్ జనాలకు కూడా మైండ్ బ్లాంక్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు మినహా.. రెస్టాఫ్ ఇండియా.. ఓవర్సీస్ తో కలిపి డిజిటల్ రైట్స్ ను కలిపి హోల్ సేల్ గా డీల్ ను రీసెంట్ గానే ఫినిష్ చేశారట. తెలుగు స్టేట్స్ ను మినహాయించి మాత్రమే.. శైలజా రెడ్డి అల్లుడి పై ఏకంగా 14 కోట్ల రూపాయలకు రైట్స్ విక్రయించడం సెన్సేషనల్ అవుతోంది. ఓ రకంగా చూస్తే.. ఇది దాదాపుగా ఫిలిం బడ్జెట్ కు కొంచెం అటూ ఇటూగా ఉండే మొత్తం.

సినిమాకు హిట్ టాక్ వస్తే.. ఇక రెండు రాష్ట్రాల నుంచి వచ్చే మొత్తం అంతా లాభాలపంటే అన్నమాట. ఓవర్ ఫ్లోస్ ఎలాగూ ఉంటాయి. ఐడ్రీమ్ మీడియా సంస్థ.. అమెజాన్ తో పోటీ పడి మరీ ఈ హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ కంపెనీలకు ధీటుగా పోటీ పడేందుకు స్థానిక సంస్థలు కూడా సిద్ధం కావడాన్ని.. సానుకూల పరిణామంగా ట్రేడ్ జనాలు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు