క్వీన్ కాదు... దటీజ్ మహాలక్ష్మి

క్వీన్ కాదు... దటీజ్ మహాలక్ష్మి

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ను దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి కొన్నేళ్ల నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు గత ఏడాది ద్వితీయార్ధంలో నాలుగు రీమేకులూ కాస్త ముందు వెనుకగా పట్టాలెక్కాయి. ఐతే మిగతా మూడు వెర్షన్ల పని సాఫీగా సాగిపోతుంటే.. తెలుగు వెర్షన్ మాత్రం దర్శకుడు నీలకంఠ తప్పుకోవడంతో ఇబ్బందుల్లో పడింది. ఆయన స్థానాన్ని వెంటనే ఎవరూ భర్తీ చేయలేదు. ఎట్టకేలకు ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మకు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. చకచకా షూటింగ్ చేసేస్తున్నాడీ యువ దర్శకుడు. ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు.. టైటిల్ కూడా మారిపోవడం విశేషం. దటీజ్ మహాలక్ష్మి.. ఇదీ ఈ చిత్రానికి పెట్టిన కొత్త టైటిల్. ఇందులో కథానాయిక పాత్ర పేరు మహాలక్ష్మి. కాబట్టి ఆ పేరు కలిసొచ్చేలా సినిమాకు పెట్టేశారు.

తమన్నాకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టిన ‘100 పర్సంట్ లవ్’లోని దటీజ్ మహాలక్ష్మి పాట ఎంత ఫేమస్సో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాట పల్లవినే ‘క్వీన్’ రీమేక్ కోసం వాడేసుకున్నారు. తమిళ ‘క్వీన్’ రీమేక్‌ కు ‘ప్యారిస్ ప్యారిస్’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అక్కడ కాజల్ లీడ్ రోల్ చేస్తోంది.  కన్నడలో పారుల్ యాదవ్.. మలయాళంలో మాంజిమా మోహన్  కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళ, కన్నడ వెర్షన్లకు రమేష్ అరవింద్.. మలయాళంలో రేవతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వేర్వేరు భాషల్లో వేర్వేరు తారలు నటిస్తుండటంతో కథానాయిక పాత్రలో ఎవరెలా చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నాలుగు భాషల్లోనూ మను కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు