శ్రీదేవిని చివరిసారి చూపించిన బోనీ కపూర్

శ్రీదేవిని చివరిసారి చూపించిన బోనీ కపూర్

అందాల తార శ్రీదేవి ఇప్పుడు దివికి వెళ్లిపోయింది. ఓ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి..  ఎవరూ ఊహించని విధంగా మరణించింది. కారణాలు.. వివాదాలు సంగతి పక్కన పెడితే.. ఆమె లేని లోటును అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

మిగిలిన జనాల సంగతి ఏమో కానీ.. శ్రీదేవిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న భర్త బోనీ కపూర్.. ఆమె జ్ఞాపకాల నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని కుటుంబ వేడుకలలో ఈయన పాల్గొన్నా.. అన్యమనస్కంగానే ఉన్నారని ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. ఇప్పుడీయన.. అందరి మనసులను తట్టిలేపే ఓ ట్వీట్ తో.. మరోసారి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. ఇవాళ కనుక శ్రీదేవి బతికి ఉంటే.. తమకు ఈ రోజు ఎంత స్పెషల్ గా ఉండేదో గుర్తు చేసుకున్నారు బోనీ కపూర్.

జూన్ 2.. 1996లో శ్రీదేవి-బోనీకపూర్ ల పెళ్లి జరిగింది. ఇప్పుడు కనుక ఆమె బతికుంటే.. ఇవాళ తమ 22వ వివాహ వార్షికోత్సవం అయి ఉండేదని అంటున్నారు బోనీ కపూర్. తన ప్రియురాలు.. భార్య.. తన జీవిత భాగస్వామి.. ప్రేమ చిహ్నం.. ఇప్పటికీ ఎప్పటికీ తనతోనే ఉంటుందని.. తన జ్ఞాపకాలు ఎప్పటికీ తనను వెంటాడుతూనే ఉంటాయని బోనీకపూర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ అందరి హృదయాలను మెలిపెడుతోంది. ఈ పోస్ట్ తో పాటు.. శ్రీదేవి ఆఖరి విజువల్స్ తో కూడిన చిన్న వీడియో.. ఆమె ఆఖరి క్షణాల్లో కూడా ఎంత ఆనందంగా గడిపిందో చెప్పకనే చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English