రజినీ క్యూలో అప్పుడే ఇంకోటి

రజినీ క్యూలో అప్పుడే ఇంకోటి

రజినీకాంత్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. ఏ క్షణాన రోబో2 మూవీ చేయడం మొదలుపెట్టారో కానీ.. ఆ సినిమా అనుకున్న ప్రకారమే ఆలస్యంగానే వస్తోంది. శంకర్ మూవీ కావడంతో.. లేట్ అనేది ముందే అనుకున్నదే. అయితే.. ఎక్స్ పెక్ట్ చేసిన దాని కంటే 2.ఓ బాగా లేట్ అయింది.

సీక్వెల్ లేట్ అవుతుండడంతో.. మధ్యలో వచ్చిన గ్యాప్ లోనే కాలా కరికులన్ సినిమా పూర్తి చేసేశారు రజినీ కాంత్. మరో ఐదు రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలోకి కూడా వచ్చేస్తోంది. ఇంకా రోబో సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. దసరా.. దీపావళి అంటున్నారు కానీ.. అది కూడా గ్యారంటీ లేదు. కానీ 2.ఓ చిత్రం దేశంలోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన గ్రాఫికల్ వండర్ గా నిలుస్తుందనే అంచనాల కారణంగా.. ఫ్యాన్స్ అదే హోప్స్ తో ఎదురుచూస్తున్నారు.

అయితే.. ఇప్పుడు రజినీ తన తర్వాతి సినిమాను కూడా ప్రారంభించేయబోతున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న మూవీకి రజినీ సైన్ చేశారట. ఈ సినిమా షూటింగ్ ను జూన్7న డెహ్రాడూన్ లో ప్రారంభిస్తారని తెలుస్తోంది. సిమ్రన్.. విజయ్ సేతపతి.. బాబీ సింహ ఈ మూవీలో నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా అయినా.. 2.ఓ చిత్రం తర్వాత విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయినా.. ఓ సినిమా రిలీజ్ కోసం రజినీకాంత్ ఇంతగా ఎదురుచూడాల్సి రావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

అయినా.. ప్రస్తుతం రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన కాన్సంట్రేషన్ అంతా అటు వైపు కేంద్రీకరించకుండా.. ఇలా వరుసగా సినిమాలు చేయడం ఎంతవరకూ కరెక్ట్ అనే విషయం మాత్రం ఎవరికీ అర్ధంకావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English