మాఫియాతో లింకులు అట్లే ఉన్నాయా??

మాఫియాతో లింకులు అట్లే ఉన్నాయా??

బాలీవుడ్ పరిశ్రమకు.. అండర్ వరల్డ్ మాఫియాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. సంజయ్ దత్ వ్యవహారంలో ఈ బంధాల గురించి జనాలకు బాగానే ఐడియా వచ్చింది. ఆ తర్వాత కూడా ఈ లింకులు చాలా కాలమే కొనసాగాయని అంటారు.

అనేక బాలీవుడ్ చిత్రాలకు అండర్ వరల్డ్ నుంచి సొమ్ములు అందాయనే మాటలు తరచుగా వినిపిస్తూనే ఉండేవి. ఎక్కడ డబ్బుల కుప్పలు ఉంటే.. అక్కడ మాఫియా వాలిపోతుందనే విషయం తెలిసిందే. సినిమాలతో పాటు క్రికెట్ పైనా.. అంటే క్రికెట్ బెట్టింగ్ లో కూడా మాఫియా హస్తం ఉంది. ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి ఈ లింకులు మరీ ఎక్కువయ్యాయని అంటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పోలీసులు చేసిన ఇంటరాగేషన్ లో అనేక కొత్త విషయాలు తెలియవచ్చాయని అంటున్నారు.

గతేడాది ఐపీఎల్ లో అర్బాజ్ 2.8 కోట్లను పోగొట్టుకున్నాడట. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో.. బుకీ సోను జలాన్ తో గొడవలు కూడా జరిగాయట. రీసెంట్ ఐపీఎల్ లో ఈ మొత్తాన్ని సెటిల్ చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. వీటిలో చాలా విషయాలను అర్బాజ్ తన వాగ్మూంలంలో చెప్పాడని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే.. ఇప్పటికీ బాలీవుడ్ కి- మాఫియాకి లింకులు కొనసాగుతున్నాయని అనిపించక మానదు. ప్రస్తుతం అనేక మంది బాలీవుడ్ తారలు తరచుగా దుబాయ్ విజిట్స్ చేయడం వెనుక కూడా ఈ మాఫియా లింకులే కారణంగా చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు