సిద్ధుతో లవ్.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

సిద్ధుతో లవ్.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. ఐతే అంతకంటే ముందు ఆమె తమిళ కథానాయకుడు సిద్ధార్థ్‌తో కొంత కాలం లవ్‌లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అది ఎక్కువ కాలం కాదు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఇద్దరికీ పడక విడిపోయారు. ఎవరి దారుల్లో వాళ్లు వెళ్లిపోయారు. దీని గురించి ఇటు సమంత కానీ.. అటు సిద్ధు కానీ ఎప్పుడూ ఎక్కడా మాట్లాడింది లేదు.

అందులోనూ సమంత చైతూతో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడం.. అతడిని పెళ్లి కూడా చేసుకోవడంతో దాని గురించి చర్చే లేకపోయింది. ఆమె పెళ్లి టైంలో కూడా ఎవరూ ఈ సంగతి ఎత్తలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో సమంత తన పాస్ట్ లవ్ లైఫ్ గురించి మాట్లాడటం విశేషం. ఆ విషయమై సామ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రేమ విషయంలో తనది కూడా సావిత్రి తరహా కథ కావాల్సిందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. సావిత్రి కథ తెలుసుకుంటుంటే అది తన కథలాగే అనిపించిందని ఆమె చెప్పింది. ప్రేమ విషయంలో ఆమె లాగే తాను కూడా నమ్మానని.. కానీ అదృష్టం కొద్దీ తాను తప్పించుకున్నానని.. లేదంటే తన కథ కూడా సావిత్రి లాగే అయ్యేదేమో అని ఆమె అంది. ఆ బాధ నుంచి త్వరగానే బయటపడ్డానని.. తాను చేసుకున్న పుణ్యం, అదృష్టం కొద్దీ తనకు చైతూ దొరికాడని ఇప్పుడు అనిపిస్తోందని సమంత వ్యాఖ్యానించింది.

ఈ మాటల్ని బట్టి చూస్తుంటే సిద్ధును సమంత జెమిని గణేశన్‌తో పోలుస్తోందన్నమాట. అతను తనను మోసం చేయడానికి ప్రయత్నించాడనే అర్థం సామ్ మాటల్లో ధ్వనిస్తోంది. మరి ఈ కామెంట్స్ సిద్ధు వరకు వెళ్తే అతనెలా స్పందిస్తాడన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు