మళ్లీ సవ్యసాచి కాంబినేషన్!

మళ్లీ సవ్యసాచి కాంబినేషన్!

తనకు తెలుగు రాదని.. కాబట్టి ఈ భాషలో ఎప్పటికీ సినిమాలు చేయనని ఒకప్పుడు తమిళ నటుడు మాధవన్ అన్నాడు. కానీ ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నాడు. భాష నేర్చుకున్నాడో లేక సబ్జెక్ట్ ఎగ్జైట్ చేసిందో కానీ... అక్కినేని నాగచైతన్య-చందూ మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’లో విలన్ పాత్రకు అంగీకరించాడు. ఈ సినిమా సందర్భంగా  చైతూతో అతడికి మంచి స్నేహమే కుదిరిందని చెబుతారు. ఆ సాన్నిహిత్యంతోనే మాధవన్‌ను చైతూ మరో సినిమాకు ఒప్పించినట్లు వార్తలొస్తున్నాయి.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకతవ్ంలో చైతూ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో చైతూ భార్య సమంతే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు మాధవన్ ను తీసుకోవాలనుకుంటున్నారట.

మాధవన్ ని ఒప్పించే బాధ్యత చైతూనే తీసుకున్నాడని.. ఆయన కూడా సుముఖంగానే ఉన్నారని చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. మాధవన్ ‘సవ్యసాచి’ ముగించాక ఒక బడా బాలీవుడ్ ప్రాజెక్టులో నటించాల్సింది. కానీ అతడి భుజానికి శస్త్రచికిత్స చేయడం వల్ల దాన్ని వదులుకున్నాడు. తర్వాత ఏ కొత్త సినిమా కూడా అంగీకరించలేదు. తమిళంలో హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దాంతో పాటే చైతూ తర్వాతి సినిమాలోనూ నటిస్తాడని అంటున్నారు.

‘ఇరుదు సుట్రు’.. ‘విక్రమ్ వేద’ లాంటి సెన్సేషనల్ సినిమాలతో ఆయన గొప్ప పేరే సంపాదించాడు గత కొన్నేళ్లలో. ‘సవ్యసాచి’లో నెగెటివ్ రోల్‌లో మాడీ అదరొట్టేశాడని యూనిట్ వర్గాలంటున్నాయి. ఈ చిత్రం జులైల ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు