నోరుజారిన‌ నెటిజ‌న్- ప‌రువు తీసిన త‌మిళ న‌టి !

నోరుజారిన‌ నెటిజ‌న్- ప‌రువు తీసిన త‌మిళ న‌టి !

క‌స్తూరి... గుర్తుందా? అదేనండీ బాల‌కృష్ణ నిప్పుర‌వ్వ‌లో న‌టించింది, ఇంకా  'సోగ్గాడి పెళ్లాం' .. 'మా ఆయన బంగారం' సినిమాల‌తో హిట్లు కొట్టింది. పెళ్ల‌య్యాక చాలాకాలం గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చిన క‌స్తూరి అపుడు, ఇపుడు త‌మిళ సినిమాల్లోనే ఎక్కువ‌గా బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె త‌మిళ ప‌దం 2.0 సినిమాలో ఐటెం సాంగ్ చేశారు. అదేంటీ పాత‌త‌రం క‌స్తూరి ఐటెం సాంగా... అని షాక్ అయ్యారేమో. టీజ‌ర్ చూస్తే ఇప్ప‌టికీ ఆమె మెయింటెయిన్ చేస్తున్న ఫిజిక్ కి మీరు మ‌రోసారి షాక‌వ‌క త‌ప్ప‌దు. వ‌య‌సు మీద ప‌డినా బాడీలో గ్లామ‌ర్‌ను మాత్రం కాపాడుకుంటూనే వ‌స్తున్నారామె. న‌టికి అదే క‌దా ఆస్తి.

టీజ‌ర్ లో ఆమె ఐటెం సాంగ్ బిట్స్ చూసి చాలా మంది సినీ అభిమానులు ఆమెను అభినందించారు. గ్రాండ్ ఓల్డ్ మైండ్ సెట్, మోరల్ పోలీసింగ్ కూడా సోష‌ల్ మీడియాలో కామ‌నే క‌దా. అలాంటి వ్య‌క్తి *చెల్లాదురై* అని కేవ‌లం 22 మంది ఫాలోయ‌ర్లు ఉన్న ఒక సామాన్య నెటిజ‌న్ ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేశాడు. *బాధ్య‌తాయుత‌మైన త‌ల్లి పాత్ర‌లో ఉన్న మీరు ఇలాంటి శృంగార గీతాల్లో న‌టించ‌డం స‌బ‌బేనా* అని ట్వీట్ చేశాడు. దీనిని గ‌మ‌నించిన క‌స్తూరి దానిని రీట్వీట్ చేస్తూ స్ట్రాంగ్ రిప్ల‌యి ఇచ్చింది.

ఇదో విచిత్ర‌మైన రొడ్డ‌కొట్టుడు త‌మిళ‌ మ‌నస్త‌త్వం. ఒక న‌టిగా శృంగారాత్మ‌కంగా క‌నిపించ‌డం త‌ప్ప‌. న‌ట‌న‌లో పాత్ర‌ను చూడాలి న‌టిని కాదు, అదే తాగుబోతు దృశ్యాలు, ఐటెం సాంగుల్లో, శృంగార స‌న్నివేశాల్లో న‌టించే ఒక న‌టుడిని మీరు ఇదే ప్ర‌శ్న వేయ‌గ‌ల‌రా?* అంటూ గ‌ట్టిగా నిల‌దీసింది. అంతేకాదు,  కాజ‌ల్‌, ఐశ్వ‌ర్యారాయ్ ల‌ను ఉదహ‌రిస్తూ బాలీవుడ్‌లో న‌టిగా తల్లులు చేసే ప్ర‌తి పాత్ర‌ను ఆద‌రిస్తున్నారు. మీకు తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఆ ఐటెం సాంగ్ షూటింగ్‌కు నా కొడుకు కూడా వ‌చ్చాడు. నేను ఏం త‌ప్పు చేయ‌డం లేదు కాబ‌ట్టి కాన్ఫిడెంట్ గా చేశాను. పాట చాలా బాగా వ‌చ్చింది... అంటూ చెప్పిన తీరుకు నెటిజ‌న్లు వ‌హ్వా అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు