అయితే హిట్టు... లేదంటే మట్టి!

అయితే హిట్టు... లేదంటే మట్టి!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటీవల చాలా హిట్లొచ్చాయి. రంగస్థలం, భరత్‌ అనే నేను, మహానటి చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. కొత్తరకం సినిమాలని జనం ఎంకరేజ్‌ చేస్తోన్న తీరు వల్ల మంచి సినిమాలు మరిన్ని వస్తాయనే ఆశలున్నాయి. అయితే బాగున్నాయని టాక్‌ వచ్చిన సినిమాలకి బ్రహ్మరథం పడుతోన్న జనం, బాగోలేదని టాక్‌ వస్తే మాత్రం దారుణంగా తిప్పి కొడుతున్నారు.

ఈ యేడాదిలో ఫ్లాప్‌ అయిన సినిమాల లిస్ట్‌ చూస్తే బయ్యర్లని దారుణంగా మట్టి కరిపించిన వాటి సంఖ్య ఎక్కువే వుంది. అజ్ఞాతవాసి, టచ్‌ చేసి చూడు, ఇంటిలిజెంట్‌, గాయత్రి, కిరాక్‌ పార్టీ, ఎంఎల్‌ఏ, ఛల్‌ మోహన్‌ రంగ, కృష్ణార్జున యుద్ధం, నా పేరు సూర్య, మెహబూబా, నేల టికెట్‌, తాజాగా ఆఫీసర్‌, రాజుగాడు చిత్రాల కలక్షన్లతో ఈ విషయం స్పష్టమవుతోంది. హీరోతో సంబంధం లేకుండా సినిమా బాలేదంటే తిప్పి కొడుతున్నారు. ఒక్కసారి అయినా చూడాలనే కుతూహలం కూడా చూపించడం లేదు.

దీంతో భారీ రేట్లకి అమ్ముతోన్న ఈ ట్రెండులో ఫ్లాట్‌ టాక్‌ వచ్చిన సినిమాతో బయ్యర్లు మట్టి కరుస్తున్నారు. అయితే హిట్టు, లేదా మట్టి అన్నట్టు వున్న ఈ ట్రెండులో ఏ సినిమా కొనాలన్నా బయ్యర్లు చాలా ఆలోచిస్తున్నారు. ఫ్లాప్‌ అయితే ఇంత తిరిగిచ్చేయాలనే కండిషన్లు పెట్టి మరీ కొంటున్నారు. ఏదేమైనా ప్రతి సినిమానీ ఒళ్లు దగ్గర వుంచుకుని తీయాల్సిన టైమ్‌ ఇది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు