ఆఫీసర్‌ భాగోతం... మొదటి రోజే డెఫిసిట్‌

ఆఫీసర్‌ భాగోతం... మొదటి రోజే డెఫిసిట్‌

అనామకులతో సినిమాలు తీస్తూ వుండడం వల్ల రాంగోపాల్‌వర్మ చిత్రాలకి వసూళ్లు వుండడం లేదని ఆయన వీరాభిమానులు కవరింగ్‌ ఇచ్చుకునేవారు. కానీ వర్మ వారికి ఆ ఛాన్స్‌ కూడా ఇవ్వకుండా నాగార్జునతో సినిమా తీసి మరీ మొదటి రోజు డెఫిసిట్లు వచ్చేట్టు చేసాడు. నాగార్జున, వర్మ కలిస్తే ప్రేక్షకులు క్యూ కట్టేస్తారని అంచనా వేసారు కానీ ఆఫీసర్‌ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు మినిమమ్‌ ఇంట్రెస్ట్‌ చూపించలేదు. ఈ చిత్రానికి తొలి రోజు వచ్చిన వసూళ్లతో నాగార్జున అభిమానులు తల ఎత్తుకోలేకపోతున్నారు.

ఒక స్టార్‌ హీరో సినిమాకి ఫస్ట్‌ డే వచ్చిన కలక్షన్లు చూసి పర హీరోల అభిమానులు కూడా జాలి పడుతున్నారు. నాగార్జున ఏరి కోరి వర్మకి ఇచ్చిన ఈ అవకాశాన్ని అతను పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు. నాగార్జున డేట్స్‌ ఇచ్చాడు కదా అని ఒళ్లు జాగ్రత్త పెట్టుకోకుండా తన ఇష్టానికి సినిమా తీసేసాడు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు యాభై లక్షల లోపేసని ట్రేడ్‌ రిపోర్ట్‌. ఓవరాల్‌గా వసూళ్లు రెండు కోట్లు కూడా దాటకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. తొలి రోజు పలు థియేటర్లలో కనీసం రెంట్‌ అమౌంట్లు కూడా రాకపోవడంతో బయ్యర్లు ఎదురు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఏ సినిమాకి అయినా ఫ్లాప్‌ టాక్‌ వస్తే రెండవ రోజున డెఫిసిట్లు వస్తుంటాయి. అలాంటిది నాగార్జున లాంటి పెద్ద స్టార్‌ సినిమాకి మొదటి రోజే ఇలాంటి పరిస్థితి రావడానికి వర్మ ఇటీవల తీస్తోన్న సినిమాలే కారణమని చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు