అందుకేనా మన హీరోలు వెనుకాడుతున్నారు?

అందుకేనా మన హీరోలు వెనుకాడుతున్నారు?

నితిన్ కు వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. రీసెంట్ గా వచ్చిన ఛల్ మోహనరంగా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో ఉన్న నితిన్.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం కావడంతో.. ప్రాజెక్టుపై బాగానే బజ్ ఉంది కానీ.. ఎందుకో ఈ సినిమాకు పలువురు హీరోలు మారిపోతున్నారు. చంద్రశేఖర్ యేలేటి కొత్త సినిమా అనుకున్నపుడు.. మొదటగా సాయిధరంతేజ్ పేరు వినిపించింది. తనకు వరుస ఫ్లాపులు వచ్చిన కారణంగా.. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేని తేజు.. తప్పుకున్నాడని అన్నారు. ఆ తర్వాత గోపీచంద్ ను హీరోగా తీసుకున్నట్లు న్యూస్ వచ్చింది. అక్కడ సెట్ అయినట్లే అని అంతా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు సడెన్ గా ప్రాజెక్టులోకి నితిన్ వచ్చి చేరాడు. అసలు హీరోలు వదులుకుంటున్నారా.. లేకపోతే మైత్రీ వాళ్లు సేఫ్ గేమ్ కోసం చూస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఇక్కడైనా కుదురుకున్నట్లేనా లేదా అనేందుకు ఇంకాస్త టైం పడుతుంది కానీ.. అసలు సబ్జెక్టులో దమ్ముంటే.. ఇంతమంది హీరోలు ఎందుకు మారతారు అన్నది ఒక యాంగిల్. కానీ మరో యాంగిల్ ఏంటంటే.. తన స్క్రిప్టుపై ఎంతటి నమ్మకం లేకపోతే.. ఓ దర్శకుడు ఇంతమంది హీరోలను మార్చి అయినా.. సినిమా చేసేందుకు సిద్ధపడతాడు అనేది రెండో యాంగిల్. ఏతావాతా ఏంటంటే.. చంద్రశేఖర్ యేలేటి స్టైల్ లోనే.. ఈ సినిమాను కథ నడిపిస్తుంది తప్ప హీరో కాదని.. అందుకే మన హీరోలు వెనుకాడుతున్నారని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు